Yogini Ekadashi: జూలై 10న యోగినీ ఏకాదశి.. ఈ ఒక్క వ్రతంతో సకల పాపాలు తొలగుతాయా? తిథి, ప్రాముఖ్యత తెలుసుకోండి!

జూలై 10, 2026న ఆచరించే యోగినీ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉపవాసం ఉండడం వల్ల పాపక్షయం, పుణ్యప్రాప్తి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

Published on: Jul 7, 2026, 08:00:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ మాసంలో వచ్చే యోగినీ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. సకల పాపాలను హరిస్తూ, మోక్ష మార్గాన్ని సుగమం చేసే ఈ ఏకాదశి విశిష్టత, తిథి, మరియు జూలై నెలలో రాబోయే మరో ముఖ్యమైన ఏకాదశి గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Yogini Ekadashi: జూలై 10న యోగినీ ఏకాదశి.. ఈ ఒక్క వ్రతంతో సకల పాపాలు తొలగుతాయా? తిథి, ప్రాముఖ్యత తెలుసుకోండి! (pinterest)
Yogini Ekadashi: జూలై 10న యోగినీ ఏకాదశి.. ఈ ఒక్క వ్రతంతో సకల పాపాలు తొలగుతాయా? తిథి, ప్రాముఖ్యత తెలుసుకోండి! (pinterest)

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి అత్యంత పవిత్రమైన విలువ ఉంది. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. జ్యేష్ఠ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'యోగిని ఏకాదశి' అని పిలుస్తారు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు ఈ ఏకాదశి ఒక నావలాంటిదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శివ భక్తుడైన కుబేరుడి కథతో ఈ ఏకాదశికి విడదీయలేని అనుబంధం ఉంది.

యోగినీ ఏకాదశి 2026: తేదీ మరియు ముహూర్తం

ఈ ఏడాది యోగిని ఏకాదశి తిథి జూలై 9న సాయంత్రం 7 గంటల 46 నిమిషాలకు ప్రారంభమై, జూలై 10వ తేదీ సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా తీసుకుంటే, జూలై 10న యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం ఉత్తమం. గృహస్తులు జూలై 10న ఉపవాసం ఉండగా, సన్యాసులు, సాధువులు జూలై 11న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఈ ఏడాది ఏకాదశి నాడు భరణి నక్షత్రం ఉండటం విశేషం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాగా, ఇది జీవన మరణ రహస్యాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాకుండా, ఈ రోజు 'సుకృతి' యోగం కూడా ఉండటం వల్ల ఈ వ్రత ఫలితం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

వ్రత ప్రాముఖ్యత - ఫలశ్రుతి

ఈ ఏకాదశి వ్రతం చేయడం అంటే ఎన్నో యజ్ఞాలు చేసిన దానితో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. అజ్ఞాతంగా చేసిన పాపాలను సైతం తొలగించే శక్తి ఈ ఏకాదశికి ఉంది. ఈ రోజున శ్రీహరిని స్మరిస్తూ ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఏకాదశి అంటే కేవలం భోజనం మానేయడం మాత్రమే కాదు, ఇంద్రియ నిగ్రహంతో దైవ చింతనలో గడపడం.

జూలైలో మరో విశేషం: దేవశయని ఏకాదశి

ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'దేవశయని' లేదా 'హరిశయని' ఏకాదశి అంటారు. ఇది మోక్షాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున పద్మనాభుడైన శ్రీమన్నారాయణుడిని కమల పుష్పాలతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.

పురాణాల ప్రకారం, ఈ రోజు నుంచి క్షీరసాగరంలో శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తారు. వచ్చే కార్తీక ఏకాదశి వరకు ఆయన శేషతల్పంపైనే శయనిస్తారు. కాబట్టి, ఈ నాలుగు నెలల కాలాన్ని 'చాతుర్మాస్య దీక్ష'గా పరిగణించి, భక్తులు ధర్మబద్ధమైన ఆచరణను పాటిస్తారు. ఈ సమయంలో సాత్విక ఆహారం, దైవ ప్రార్థనలకు ప్రాధాన్యత ఇస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More