పూరీ జగన్నాథ ఆలయంలోని 4 దివ్య ద్వారాలు, 22 మెట్ల రహస్యం తెలుసా? ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన విశేషాలు

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఒడిశాలోని జగన్నాథ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రథయాత్రలో స్వామివారిని దర్శించుకోవడం ఎంత పుణ్యప్రదమో, ఆలయంలోని నిర్మాణ వైభవం, నాలుగు దివ్య ద్వారాలు, 22 పవిత్ర మెట్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనదిగా భావిస్తారు.

Published on: Jul 8, 2026, 14:01:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరి క్షేత్రం భక్తకోటితో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్మాణం, అందులోని నాలుగు దివ్య ద్వారాలు, 22 మెట్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది.

పూరీ జగన్నాథ ఆలయంలోని 4 దివ్య ద్వారాలు, 22 మెట్ల రహస్యం తెలుసా? ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన విశేషాలు (pinterest)
పూరీ జగన్నాథ ఆలయంలోని 4 దివ్య ద్వారాలు, 22 మెట్ల రహస్యం తెలుసా? ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన విశేషాలు (pinterest)

జగన్నాథుని రథయాత్ర: 4 ద్వారాలు, 22 మెట్ల వెనుక ఉన్న పరమార్థం

ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఒడిశాకు తరలివచ్చారు. స్వామివారిని రథాలపై చూడడం ఒక ఎత్తు అయితే, జగన్నాథుని ఆలయంలో అడుగుపెట్టి ఆ పరమాత్మను స్మరించుకోవడం ఇంకో ఎత్తు. ఎన్నో శతాబ్దాల చరిత్ర, అందుచిక్కని రహస్యాలు ఈ ఆలయ నిర్మాణంలో ఉన్నాయి. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా?

నాలుగు దిక్కులా నాలుగు దివ్య ద్వారాలు

జగన్నాథుని ఆలయంలో నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వీటిని సింహద్వారం, వ్యాఘ్రద్వారం, హస్తిద్వారం, అశ్వద్వారం అని అంటారు. ఇవి కేవలం ప్రవేశ ద్వారాలే కాదు. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకలుగా కూడా భావిస్తారు.

సింహ ద్వారం

సింహ ద్వారం తూర్పు వైపు ఉంటుంది. ఇది ప్రధాన ప్రవేశ ద్వారం. ద్వారం ఇరువైపులా సింహాల విగ్రహాలు ఉంటాయి. భక్తులు ఎక్కువగా ఈ ద్వారం నుంచే లోపలికి వెళ్తారు. ఆధ్యాత్మిక ఉన్నతికి, మోక్షానికి బాటలు వేసే ద్వారంగా దీనిని భావిస్తారు. అందుకే చాలామంది భక్తులు ఈ మార్గం నుంచే ఆలయంలోకి ప్రవేశిస్తారు.

వ్యాఘ్ర ద్వారం

ఇక్కడ పులి విగ్రహాలు ఉంటాయి. ధైర్యానికి, ధర్మ పరిరక్షణకు ఇది చిహ్నంగా భావిస్తారు. కోరికలను జయించి ధర్మ మార్గంలో నడవాలని ఈ ద్వారం సందేశాన్ని ఇస్తుంది. సాధువులు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారు.

హస్తి ద్వారం

ఈ ద్వారం వద్ద ఏనుగుల విగ్రహాలు ఉంటాయి. ఏనుగులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి, సంపదకు, విజ్ఞానానికి ఇవి సంకేతంగా భావిస్తారు.

అశ్వ ద్వారం

ద్వారం వద్ద గుర్రాల విగ్రహాలు ఉంటాయి. ఇది విజయానికి, వీరత్వానికి ప్రతీక. యుద్ధ భంగిమలో ఉన్న జగన్నాథుడు, బలభద్రుల రూపాలు ఇక్కడ కనిపిస్తాయి.

22 మెట్ల రహస్యం

ఆలయ ప్రవేశంలో ఉండే 22 మెట్లను బైసీ పహాచా అని అంటారు. ఈ 22 మెట్లు మనిషి జీవితంలో ఉండే 22 రకాల బలహీనతలు, లోపాలకు సంకేతంగా భావిస్తారు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు భక్తులు తమలోని అహంకారం, చెడు ఆలోచనలను వదిలి పెట్టి భగవంతుని శరణు కోరుతారని ప్రతీతి.

ముఖ్యంగా వీటిలో మూడో మెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని యమశిల అని అంటారు. జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఈ మూడో మెట్టును తొక్కకూడదని నమ్మకం. అలా చేస్తే భక్తులు పొందిన పుణ్యం తగ్గిపోతుందని చెబుతారు. అందుకే లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More