పుత్రదా ఏకాదశి 2026: విష్ణువును ఇలా పూజిస్తే శుభ ఫలితాలు.. ఈ మంత్రాలు పఠించండి

పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించడం, ఉపవాసం పాటించడం, తులసి, పసుపు పూలు, పండ్లు సమర్పించడం, దానధర్మాలు చేయడం శుభప్రదమని ఈ కథనం పేర్కొంటోంది. 

Published on: Aug 21, 2026, 12:30:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న వచ్చింది. ఆ రోజు విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే పుత్రదా ఏకాదశి నాడు ఎలా విష్ణువుని పూజించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అద్భుతమైన లాభాలను చూడొచ్చు.

పుత్రదా ఏకాదశి 2026: విష్ణువును ఇలా పూజిస్తే శుభ ఫలితాలు.. ఈ మంత్రాలు పఠించండి (pinterest)
పుత్రదా ఏకాదశి 2026: విష్ణువును ఇలా పూజిస్తే శుభ ఫలితాలు.. ఈ మంత్రాలు పఠించండి (pinterest)

ఏకాదశి తిథి ఎప్పుడు మొదలవుతుంది?

శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23 ఉదయం 2:00 గంటలకు మొదలవుతుంది. ఆగస్టు 24 ఉదయం 4:18 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి అనుకూలంగా ఉంటుంది.

విష్ణువుని ఎలా ఆరాధించాలి?

స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత విష్ణువు ఎదుట దీపారాధన చేసి, పసుపు రంగు పూలను, పండ్లను సమర్పించాలి. తులసి ఆకులను కూడా విష్ణువుని పూజించడానికి ఖచ్చితంగా ఉపయోగించాలి. ఉపవాసం ఉండి, విష్ణు మంత్రాలను పఠించాలి. ఇలా ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

విష్ణువుకి తులసిని సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. పూజ అయిపోయిన తర్వాత పేదలకు, ఏమీ లేని వారికి, అవసరమైన వారికి సహాయం చేయడం మంచిది. దానధర్మాలు చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.

విష్ణు నామస్మరణ చేయడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే విష్ణు నామస్మరణ చేయడం వలన సహనం పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇలా విష్ణువుని ఆరాధించడం వలన పుత్రదా ఏకాదశి రోజున అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.

పుత్రదా ఏకాదశి నాడు ఈ విష్ణు మంత్రాలను కూడా పఠించండి

1. శ్రీ విష్ణు మూల మంత్రం

ఓం నమో నారాయణాయ

2. విష్ణు గాయత్రీ మంత్రం

ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి

తన్నో విష్ణుః ప్రచోదయాత్

3. విష్ణు ధ్యాన శ్లోకం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్

4. విష్ణు స్తుతి

మంగళం భగవాన్ విష్ణుః

మంగళం గరుడధ్వజః

మంగళం పుండరీకాక్షః

మంగళాయ తనో హరిః

5. విష్ణు నామ మంత్రం

ఓం నమో భగవతే వాసుదేవాయ

6. హరే కృష్ణ మహామంత్రం

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More