...
...
Next Story

పుత్రదా ఏకాదశి నాడు ఈ 5 పనులకు దూరంగా ఉండండి.. వ్రత ఫలితాలు పొందండి!

శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పుత్రదా ఏకాదశి సంతానం కోరుకునే వారికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం పుత్రదా ఏకాదశి ఏడాదికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న, వ్రత విరమణ ఆగస్టు 24న చేయాలని పేర్కొంటున్నారు.

Published on: Aug 18, 2026, 16:00:12 IST
Advertisement

ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొడుకులు పుట్టాలనుకునే వారికి ఈ ఏకాదశి చాలా మంచి రోజు. ఆ రోజున సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే పుత్రుడు కలిగే అవకాశం ఉంది. సనాతన సంప్రదాయం ప్రకారం నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.

ఈ సంవత్సరంలో రెండు సార్లు పుత్రదా ఏకాదశి

పుత్రదా ఏకాదశి నాడు ఈ 5 పనులకు దూరంగా ఉండండి.. వ్రత ఫలితాలు పొందండి! (pinterest)
పుత్రదా ఏకాదశి నాడు ఈ 5 పనులకు దూరంగా ఉండండి.. వ్రత ఫలితాలు పొందండి! (pinterest)

హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, ఈ పుత్రదా ఏకాదశి ఏడాదికి రెండుసార్లు వస్తుంది. పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని పుష్య పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు గురించి వివరంగా తెలుసుకుందాం.

శ్రావణ పుత్రదా ఏకాదశి 2026

శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న వచ్చింది. ఆగస్టు 24న వ్రత విరమణ చేయాలి. పుత్రదా ఏకాదశి నాడు ఈ పనులు చేయడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. పుత్రదా ఏకాదశి నాడు ఈ తప్పులు చెయ్యకూడదు.. దాంతో అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

1.పెద్దలను అవమానించకూడదు

పుత్రదా ఏకాదశి నాడు ఇంట్లో ఉండే పెద్దవారిని అవమానించకూడదు. వారిపట్ల చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు.

2.ధాన్యాలను తీసుకోకూడదు

మత గ్రంథాల ప్రకారం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి ధాన్యాలను కూడా తీసుకోకూడదు. అలా చేయడం వలన వ్రత సంపూర్ణ ఫలితాలు దక్కవు.

3.అన్నం తినకూడదు

శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు మాంసాహారం, మద్యం, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. వ్రతం ద్వారా లభించే శుభ ఫలితాలు తగ్గుతాయి.

5.పగలు నిద్రపోకూడదు

ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్లు పగలు నిద్రపోవడం మంచిది కాదు. అలాగే ఎవరినీ దూషించకూడదు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా మంచిది కాదు.

పుత్రదా ఏకాదశి వ్రత నియమాలు

శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని నిర్జలంగా, నీటిని తీసుకుంటూ, పండ్లు తింటూ, సైంధవ లవణం తీసుకుంటూ ఆచరించాలి. అలాగే ఆరోజు అబద్ధాలు చెప్పడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులను విమర్శించడం వంటివి చేయకూడదు.

విష్ణువుని ఆరాధించండి

శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు విష్ణువు పూజలో పసుపు రంగు పూలు, పసుపు రంగు పండ్లు, తులసి దళాలు కచ్చితంగా ఉపయోగించాలి.

వ్రత విరమణ

ద్వాదశి రోజున వ్రత విరమణ చేయాలి. ఆ రోజు సూర్యోదయం తర్వాత బ్రాహ్మణులకు భక్తితో భోజనం పెట్టాలి. దక్షిణ లేదా దానధర్మాలు సమర్పించాలి. ఇలా వ్రతాన్ని విరమించాలి. పంచాంగం ప్రకారం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఉదయం 5:24కి విరమించడం శుభప్రదం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks