...
...
Next Story

నేడు రాహు–చంద్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి సమస్యలు తప్పవా?

సెప్టెంబర్ 23న చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే అక్కడ సంచరిస్తున్న రాహువుతో చంద్రుడి కలయిక ఏర్పడుతుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ కలయికను గ్రహణ యోగంగా పేర్కొంటూ, కొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని ఈ కథనం చెబుతోంది.

Published on: Sep 23, 2026, 12:30:18 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి రాశి మార్పు వలన శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నేడు రాహు–చంద్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి సమస్యలు తప్పవా? (AI)
నేడు రాహు–చంద్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి సమస్యలు తప్పవా? (AI)

కుంభరాశిలో రాహువు, చంద్రుడు సంయోగం చెందబోతున్నారు. కుంభరాశిలో రాహువుతో చంద్రుడు కలవడం వలన ఏర్పడుతున్న గ్రహణ యోగం కొన్ని రాశుల వారికి నష్టాలను, పెనుముప్పులను తెచ్చి పెట్టబోతోంది. కాబట్టి, ఈ సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఈరోజే కుంభరాశిలో రాహువు, చంద్రుల కలయిక

సెప్టెంబర్ 23, అంటే ఈరోజు శని రాశి అయినటువంటి కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే కుంభరాశిలో రాహువు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగానికి దారితీస్తుంది. ఈ అశుభ యోగం వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అలాగే, కొన్ని రాశుల వారు తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ యోగం వలన ఏ రాశుల వారికి సమస్యలు ఉండొచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహణ యోగంతో ఈ రాశుల వారికి సమస్యలు ఉండొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు గ్రహణ యోగం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రాహువు, చంద్రుడు కలవడంతో ఈ రాశి వారికి కొన్ని రోజులు అనూహ్యమైన మార్పులు ఉండొచ్చు. సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రమేయం లేకుండా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.

కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణ యోగం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరో స్థానాన్ని శత్రువులు, రోగాలు, అప్పులు, దీర్ఘకాలిక సమస్యలకు ప్రతీక అంటారు. ఈ స్థానంలో గ్రహణ యోగం ఏర్పడడం వలన శత్రువుల కారణంగా ఇబ్బందులు ఉండొచ్చు. మీ ఎదుగుదల చూసి ఇతరులు ఓర్వలేరు.

అలాగే, మీ ఆఫీస్ పనుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు, కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి.

3.మీన రాశి

మీన రాశి వారికి ఈ అశుభ యోగం వలన ఈ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరంగా ఖర్చులు పెరిగిపోతాయి. నష్టాలు ఎదురవొచ్చు. రాహువు, చంద్రుల కలవడంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవ్వచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బు అనవసర విషయాలకు ఖర్చు అయిపోతుంది.

కాబట్టి, ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా తొందరపడి పెట్టుబడులు పెడితే నష్టపోవాల్సి ఉంటుంది. వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కూడా సమస్యలు ఉండొచ్చు. ఉద్యోగస్తులు దైనందిన విధులను శ్రద్ధగా పూర్తి చేయాలి. బాధ్యతలు నిర్లక్ష్యం చేయొద్దు. అధికారుల ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా తగ్గిపోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks