సెప్టెంబర్ 23 బుధవారం రాశి ఫలాలు.. డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ప్రయాణం.. నేడు ఏ రాశికి ఎలా ఉందంటే?

2026 సెప్టెంబర్ 23, బుధవారం నాటి రాశిఫలాల ప్రకారం, వినాయకుడి అనుగ్రహంతో కొన్ని రాశులకు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ప్రేమ వంటి అంశాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. 

Published on: Sep 23, 2026, 04:00:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సాంప్రదాయం ప్రకారం బుధవారం రోజు విఘ్నేశ్వరుడైన వినాయకుడితో పాటు సంకట హర గణపతిని భక్తిశ్రలతో పూజిస్తారు. సెప్టెంబర్ 23, 2026 నాటి బుధవారం నాడు గ్రహ నక్షత్రాల స్థితిగతులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను అందించనుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఆయా రాశుల వారి దైనందిన జీవితం, కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

సెప్టెంబర్ 23 బుధవారం రాశి ఫలాలు.. డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ప్రయాణం.. నేడు ఏ రాశికి ఎలా ఉందంటే? (AI)
సెప్టెంబర్ 23 బుధవారం రాశి ఫలాలు.. డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ప్రయాణం.. నేడు ఏ రాశికి ఎలా ఉందంటే? (AI)

మేష రాశి:

మేష రాశి వారికి నేడు కుటుంబం నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల చేయూత మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలతో అనవసర కొనుగోళ్లకు పోవద్దు. మీ ప్రియమైన వ్యక్తితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మనసులోని ఆందోళనలను పక్కన పెట్టి సరదాగా బయటకు వెళ్లే ప్రణాళికలు రచిస్తారు.

వృషభ రాశి:

ఆరోగ్య పరంగా కొందరు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది, కాబట్టి తగు జాగ్రత్తలు అవసరం. మీలోని ప్రత్యేక నైపుణ్యాలు, అంకితభావం ఎంతటి క్లిష్టమైన పనైనా ఇటుకల మీద నీరులా సులువుగా మార్చేస్తాయి. ఇంటి విషయాలు లేదా కుటుంబంలో తలెత్తే చిన్నపాటి వివాదాలకు దూరంగా ఉండటం ద్వారా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోగలుగుతారు.

మిథున రాశి:

ఎప్పటినుంచో మీ వెన్నంటి వేధిస్తున్న ఒక పెద్ద సమస్య నుంచి త్వరలోనే మీకు విముక్తి కలగనుంది. మిథున రాశి జాతకులకు రేపు సంపాదనకు సంబంధించి అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ఇలాంటి చక్కటి అవకాశాలను చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవడం మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది.

కర్కాటక రాశి:

మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ బాల్య స్నేహితులు కొందరిని ఊహించని రీతిలో కలుసుకునే అవకాశం ఉంది. ఇది పాత జ్ఞాపకాలను మళ్ళీ మననం చేసుకునేలా చేస్తుంది. మీ వైవాహిక లేదా ప్రేమ జీవితంలో ప్రేమను పెంచడానికి మీ బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.

సింహ రాశి:

సింహ రాశి వారు తమ దృష్టిని పూర్తిగా ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్రీకరిస్తారు, దీనివల్ల మంచి లాభాలను ఆర్జిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీతో కలిసి ఎవరినైనా ఆత్మీయులను కలవడానికి వెళ్లాలని ఆశపడవచ్చు. వారి కోరికను నెరవేర్చండి. అలాగే వ్యాపార లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి.

కన్యా రాశి:

దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి నేడు తగిన రోజు. అయితే మీ ఆహారపు అలవాట్లపై తీవ్రమైన నిఘా ఉంచాలి. మరీ ముఖ్యంగా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. సాయంత్రం వేళ మీ భాగస్వామితో బయటకు వెళ్లేముంద వారి మూడ్‌ను అర్థం చేసుకుని మసులుకోవడం మంచిది.

తులా రాశి:

మీ లగేజ్ సర్దేయడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఓ మంచి ప్రయాణం మీకోసం ఎదురుచూస్తోంది. జీవితంలో అనుభవం ఉన్న పెద్దల సలహాలను ఏమాత్రం నిర్లక్ష్య చేయకండి. మీ క్షేమం కోసమే వారు ఆ మాటలు చెబుతారని గుర్తుంచుకోండి. అయితే రొమాంటిక్ లైఫ్ విషయానికి వస్తే భాగస్వామికి సమయం కేటాయించడం కాస్త కష్టమవ్వవచ్చు.

వృశ్చిక రాశి:

వ్యాపార రంగంలో రాణించే వారు తమ ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. లెక్కలేకుండా ఖర్చు చేయడం భవిష్యత్తులో ఇబ్బంది తెస్తుంది. శారీరకంగా మిమ్మల్ని మీరు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఫ్రెష్‌గా అనుభూతి చెందుతారు. చిన్నపాటి దుకాణదారులు కూడా రేపు మంచి లాభాలను గడించే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి:

డబ్బు మరియు ఆర్థిక వ్యవహారాలలో అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. స్నేహితులతో కలిసి సరదాగా ట్రిప్ వేసే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఈ ప్రయాణం మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

మకర రాశి:

పాజిటివ్ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారంలో కీలకమైన డీల్స్ కుదరడం ద్వారా మీ చేతికి భారీగా ధనం అందే అవకాశం ఉంది. అలాగే బంధుమిత్రుల రాకతో ఇంటా బయటా వాతావరణం ఎంతో సందడిగా మారుతుంది.

కుంభ రాశి:

మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం మీ సొంతమయ్యే అదృష్టం ఉంది. మీ భాగస్వామి పట్ల మీరు చూపే ప్రత్యేక శ్రద్ధ మీ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆరోగ్యం కోసం తగినంత నీరు తాగడంతో పాటు పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

మీన రాశి:

ఎవరి గురించైనా అనవసరమైన చాడీలు, గాసిప్‌లకు దూరంగా ఉండటమే ఉత్తమం. కుటుంబంలో ఏదైనా సమస్య తలెత్తితే మీ ఇంటి పెద్దల సలహా తీసుకోండి, వారి అనుభవం మిమ్మల్ని ఆ గండం గట్టెక్కిస్తుంది. ఏదైనా ప్రత్యేకమైన వస్తువును కొనుగోలు చేయడానికి మీరు మరో నగరానికి ప్రయాణం చేయాల్సి రావచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More