బుధవారం ఈ 5 రాశులకు బంపర్ బెనిఫిట్స్.. ఉద్యోగం, డబ్బు, వ్యాపారంలో లాభాలు!

గ్రహాలు, నక్షత్రాల గమనంలో మార్పుల కారణంగా సెప్టెంబర్ 2, బుధవారం 12 రాశుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. కొన్ని రాశులకు కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు లభించగా, మరికొన్ని రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం, సంబంధాలు, నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Published on: Sep 2, 2026, 04:00:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో బుధవారం రోజున విఘ్నేశ్వరుడైన శ్రీ గణేశుడిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వినాయకుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. మారుతున్న గ్రహాల రాశులు, నక్షత్రాల గమనం ప్రకారం సెప్టెంబర్ 2, బుధవారం రోజు పలు రాశుల వారికి ఎంతో కీలకమైనదిగా మారింది. కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనుండగా, మరికొన్ని రాశులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. నేటి దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బుధవారం ఈ 5 రాశులకు బంపర్ బెనిఫిట్స్.. ఉద్యోగం, డబ్బు, వ్యాపారంలో లాభాలు!
బుధవారం ఈ 5 రాశులకు బంపర్ బెనిఫిట్స్.. ఉద్యోగం, డబ్బు, వ్యాపారంలో లాభాలు!

మేష రాశి:

ఈ రోజు మేష రాశి వారి మనసు ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా మారుతుంది. కార్యాలయంలో మీకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు, వాటిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అయినప్పటికీ అనవసరమైన ఆన్‌లైన్ షాపింగ్‌లకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృషభ రాశి:

వృషభ రాశి జాతకులకు నేడు వృత్తిరీత్యా ఎంతో నేర్చుకునే అవకాశం దక్కుతుంది. మీ పనితీరును గమనించిన పైఅధికారులు ప్రత్యేకంగా అభినందిస్తారు. కుటుంబంలో చిన్నపాటి విషయాలపై చర్చలు జరిగినా, కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడం ఉత్తమం. ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ రోజు ఏదో ఒక రూపంలో మంచి వార్త వినబడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండి, తోటి ఉద్యోగుల మధ్య మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బంధాల్లో గతంలో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. సాయంత్రం సమయంలో స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. అయితే అనుకోని చిన్న ఖర్చులు ఎదురుకావచ్చు.

కర్కాటక రాశి:

ఈ రోజు కర్కాటక రాశి వారు తమ పనులను పూర్తి చేయడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లోని పెద్దల సలహాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రేమ జీవితంలో భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం ముఖ్యం, లేదంటే చిన్న విషయాలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రాత్రివేళ తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అదృష్టం కలిసి వస్తుంది. ఆఫీస్‌లో మీరు చెప్పే ఐడియాలు, సలహాలను అందరూ మెచ్చుకుంటారు. సొంతంగా వ్యాపారం నిర్వహించే వారికి ఊహించని రీతిలో లాభాలు వచ్చే సూచనలున్నాయి. మీ భాగస్వామితో రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. అయితే ఎలాంటివేశంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం.

కన్య రాశి:

కన్య రాశి జాతకులు ఏ పని తలపెట్టినా ముందుగా చక్కటి ప్రణాళిక వేసుకోవడం అవసరం. తొందరపాటులో చేసే పనులు చెడిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు అవివాహితులుగా ఉన్నవారికి ప్రత్యేక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా సాగుతుంది. వేయించిన లేదా కారంగా ఉండే బయటి తిండికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తులా రాశి:

ఈ రోజు తులా రాశి వారి పూర్తి దృష్టి తమ కెరీర్‌ను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. వృత్తి జీవితానికి సంబంధించి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భాగస్వామితో గడిచిన పాత విషయాలను మళ్లీ ప్రస్తావించి వాదనలకు దిగకండి. రోజువారీ ఖర్చులపై నిఘా పెట్టడం చాలా అవసరం.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆశించిన వేగంతో పనులు పూర్తి కాకపోవచ్చు, కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరిస్తే పరిస్థితులు మీ దారికి వస్తాయి. ఈ రోజు ఎలాంటి ఆర్థిక సంబంధిత పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. భాగస్వామితో మీ భావాలను ప్రేమగా వ్యక్తపరచండి. రోజంతా పడిన శ్రమ వల్ల కలిగిన అలసటను తీర్చుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోండి.

ధనుస్సు రాశి:

కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు దక్కి మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చిస్తారు. లవ్ లైఫ్ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. వృథా ఖర్చులకు అడ్డుకట్ట వేయండి.

మకర రాశి:

మకర రాశి వారు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడం ద్వారా మీ మనసులోని బరువు తగ్గి ఉల్లాసంగా ఉంటారు. భాగస్వామి మనసును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. కడుపునకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు రాకుండా మంచి ఆహారం తీసుకోండి.

కుంభ రాశి:

ఎప్పటినుంచో ప్రారంభించాలనుకుంటున్న పనులకు ఈ రోజే సరైన శ్రీకారం చుట్టవచ్చు. కార్యాలయంలో మీలోని క్రియేటివిటీకి పైఅధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేহులతో అకస్మాత్తుగా కలిసి సరదాగా గడిపే అవకాశం ఉంది. ప్రేమ బంధాలలో ఈగోను అస్సలు దరిచేరనీయకండి.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ రోజు పనిభారం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ, సమయానికి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. పాత క్లయంట్లు లేదా సన్నిహితుల ద్వారా ఊహించని ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మౌనంగా ఉండటం చాలా మంచిది. భాగస్వామికి తగినంత సమయం కేటాయించండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More