...
...
Next Story

ధనిష్ట నక్షత్రంలోకి రాహువు సంచారం - ఆగస్టు నుంచి ఈ 3 రాశులకు బంపర్ లాభాలు..!

2026 ఆగస్టు 2న రాహు గ్రహం అంగారకుడి నక్షత్రమైన 'ధనిష్ట'లోకి ప్రవేశించనుంది. అనంతరం డిసెంబర్ 5, 2026 వరకు కుంభరాశిలోనే రాహువు సంచరిస్తాడు. ఈ ప్రభావంతో పలు రాశుల వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు, కెరీర్‌లో గుర్తింపు, వ్యాపార వృద్ధి కలగనున్నాయి.

Published on: Jul 20, 2026, 07:26:11 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత మర్మమైన, అంతుచిక్కని గ్రహంగా భావించే రాహువు కదలికల్లో త్వరలోనే కీలక మార్పు చోటుచేసుకోనుంది. ప్రస్తుతం శని దేవుడి స్వక్షేత్రమైన కుంభరాశిలో, తన సొంత నక్షత్రంలో కొలువై ఉన్న రాహువు.. మరికొద్ది రోజుల్లో అంగారకుడి (కుజుడు) నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.

ఆగస్టు 2 నుండి ధనిష్ట నక్షత్రంలోకి రాహువు
ఆగస్టు 2 నుండి ధనిష్ట నక్షత్రంలోకి రాహువు

హిందూ పంచాంగం ప్రకారం….. ఆగస్టు 2, 2026న రాహువు 'ధనిష్ట' నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం డిసెంబర్ 5, 2026 వరకు కుంభరాశిలోనే రాహువు సంచారం కొనసాగుతుంది. ఈ నక్షత్ర, రాశి మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి బంపర్ లాభాలు కలగనున్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు.

ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం:

కుంభరాశిలో రాహువు సంచారం మరియు ధనిష్ట నక్షత్ర ప్రవేశం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, అఖండ విజయాలు లభించనున్నాయి. ఆ రాశుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మేష రాశి : రాహువు మేష రాశి వారికి 11వ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనాలు ఉంటాయి.
  • కన్యా రాశి : ఈ రాశి వారికి రాహువు 6వ స్థానంలో ఉండటం వల్ల పోటీల్లో విజయం, అనుకూల ఫలితాలు దక్కుతాయి.
  • ధనుస్సు రాశి : రాహువు 3వ స్థానంలో సంచరించడం వల్ల ధైర్యసాహసాలు పెరిగి, చేపట్టిన పనుల్లో అద్భుత విజయాలు సాధిస్తారు.

కెరీర్, వ్యాపారంలో ఊహించని మార్పులు:

రాహువు యొక్క ఈ శుభ ప్రభావం వల్ల సదరు రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు రానున్నాయి. కెరీర్‌లో అంకితభావంతో చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో మంగళప్రదంగా మారనుంది. మల్టీటాస్కింగ్ (ఒకేసారి పలు బాధ్యతలు చేపట్టడం) చేయడం ద్వారా మరిన్ని ఎక్కువ అవకాశాలను అందుకోవచ్చు. ఈ కాలంలో ఆర్థిక సహాయం అందడంతో పాటు, ఆయా రాశుల వారు పూర్తి శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా గడుపుతారు.

పరిహారాలు:

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా జ్యోతిష్య లెక్కల ఆధారంగా ఇవ్వబడినది. మరింత సమాచారం కోసం సంబంధిత రంగ నిపుణులను సంప్రదించగలరు.)

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe