రాహు కేతువుల మహా సంచారం - రాబోయే రోజుల్లో ఈ రాశులకు అద్భుతమైన యోగం..!
2026 డిసెంబర్ 5న జరిగే రాహు కేతువుల రాశి మార్పు వల్ల వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి అద్భుతమైన యోగం పట్టనుంది. వీరికి కెరీర్ పురోగతి, ధనలాభం కలగనున్నాయి.

వేద జ్యోతిష్యశాస్త్రంలో నీడ గ్రహాలుగా పిలిచే రాహు, కేతువుల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సుమారు ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారే ఈ గ్రహాలు… 2026 డిసెంబర్ 5న తమ స్థానాలను మార్చుకోనున్నాయి. రాహువు కుంభరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి, కేతువు సింహరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఈ మహా సంచారానికి ముందు సమయం 5 రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని, కొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతోంది.
ప్రయోజనాలు పొందే ఆ 5 రాశులు:
- వృషభ రాశి : పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
- మిథున రాశి : కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాలు దక్కుతాయి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి.
- సింహ రాశి : పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో, కార్యాలయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్తులో లబ్ధి చేకూర్చే కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
- తులా రాశి : ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలించి, కుటుంబ మద్దతు లభిస్తుంది.
- మకర రాశి : రాహువు మీ రాశిలోకి ప్రవేశించే ముందే అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ధనలాభానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
ఈ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మేషం, ధనుస్సు : తొందరపాటు నిర్ణయాలు వద్దు, కెరీర్‌లో ఓపిక అవసరం.
- కర్కాటకం, కుంభం : కుటుంబం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, పాత పనులను ముందుగా పూర్తి చేయండి.
- కన్య, వృశ్చికం, మీనం : ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి.
రాహు కేతువుల సంచారం ఎందుకు ప్రత్యేకం?
జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఆశయం, ఆకస్మిక అవకాశాలు, సాంకేతికతకు కారకుడిగా భావిస్తే.. కేతువును ఆధ్యాత్మికత, అనుభవానికి కారకుడిగా చూస్తారు. ఈ రెండు గ్రహాల మార్పు మానవుల నిర్ణయాత్మక సామర్థ్యాన్ని, ఆర్థిక, కుటుంబ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

