జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువులను అత్యంత ప్రభావవంతమైన, అంతుచిక్కని ఛాయాగ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ వక్రమార్గంలోనే (రివర్స్ మోషన్) సంచరిస్తాయి. 2026లో రాహు, కేతువుల నక్షత్ర పరివర్తనం కారణంగా ద్వాదశ రాశుల జీవితాల్లో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి.

ప్రస్తుతం శని దేవుడి స్వక్షేత్రమైన కుంభరాశిలో రాహువు, సూర్యుని రాశి అయిన సింహరాశిలో కేతువు విరాజిల్లుతున్నారు. రాహువు శతాభిషా నక్షత్రంలోనూ, కేతువు మఖ నక్షత్రంలోనూ ప్రయాణిస్తున్నారు.
హిందూ పంచాంగ గణనాల ప్రకారం…. 2026 ఆగస్టు 2న రాహువు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. మరోవైపు కేతు గ్రహం 2026 నవంబర్ 25 వరకు మాఘ నక్షత్రంలోనే కొనసాగనుంది. ఈ నక్షత్ర సంచారం మేష రాశి మొదలుకొని మీన రాశి వరకు సర్వమానవాళిపై తన ప్రభావాన్ని చూపుతుంది.
"రాహువు ధనిష్ట నక్షత్రంలోకి మారడం వల్ల మేష, కన్య, ధనుస్సు రాశుల వారికి విశేషమైన అనుకూల ఫలితాలు అందుతాయి. అలాగే మఖ నక్షత్రంలో కేతువు సంచారం వల్ల మేష, సింహ, వృశ్చిక, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి," అని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. గ్రహాల అనుగ్రహంతో లబ్ధి పొందే రాశుల వివరాలు కింది విధంగా ఉన్నాయి….
మేష రాశి :
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మేష రాశి వారికి ఇకపై మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వ్యాపార రంగంలో మీరు వేసే ప్రణాళికలు ఆశించిన విజయాన్ని అందిస్తాయి. నిరుద్యోగులు, ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి.
కన్యా రాశి :
న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న కన్యా రాశి వారికి తీపి కబురు అందే అవకాశం ఉంది. రాహువు సంచారంతో ఆర్థిక సమస్యలు ఒక్కటొక్కటిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
ధనుస్సు రాశి :
{{/usCountry}}న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న కన్యా రాశి వారికి తీపి కబురు అందే అవకాశం ఉంది. రాహువు సంచారంతో ఆర్థిక సమస్యలు ఒక్కటొక్కటిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
ధనుస్సు రాశి :
{{/usCountry}}వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. లాభసాటి పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. ప్రేమ జీవితంలో చిన్నపాటి గందరగోళం ఏర్పడే సూచనలు ఉన్నందున, పిల్లలు మరియు జీవిత భాగస్వామితో సమయం గడపడం శ్రేయస్కరం.
సింహ రాశి :
వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభించి, వృత్తిపరమైన ప్రతిష్ట పెరుగుతుంది. నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది. అయితే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా బయటి ఆహారం తినడం తగ్గించాలి.
వృశ్చిక రాశి :
ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామి సలహాలు స్వీకరించడం మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తల్లిగారితో ఆత్మీయంగా సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం.
కుంభ రాశి :
కుంభ రాశి వారి గృహంలో సంతోషం, సమృద్ధి వెల్లివిరుస్తాయి. వ్యాపారంలో ఎదురయ్యే చిన్నపాటి ప్రతిబంధకాలను సునాయాసంగా అధిగమిస్తారు. దీర్ఘకాలంగా మొండిబాకీలుగా మారిన డబ్బు తిరిగి మీ చేతికి చేరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.