శని నక్షత్రంలోకి సూర్యుడు : ఈ 4 రాశుల వారికి 14 రోజుల పాటు రాజయోగం! అదృష్టం మీ వైపే
పుష్య నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశంతో కన్య, తులా, మకరం, వృషభ రాశుల జాతకులకు అదృష్టం వరించనుంది. ఆగస్టు 3 వరకు ఏ రాశికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో వివరంగా తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పునకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లో ఏదో ఒక ప్రభావం పడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడు తాజాగా శనిదేవుడికి చెందిన నక్షత్రంలోకి అడుగుపెట్టాడు.

హిందూ పంచాంగం ప్రకారం… జూలై 20వ తేదీన ఉదయం 11:33 గంటలకు సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం సూర్యుడు, శనిదేవుల మధ్య తండ్రీకొడుకుల సంబంధం ఉంటుంది. ఇప్పుడు శనికి చెందిన పుష్య నక్షత్రంలో సూర్యుడి ప్రయాణం ఆగస్టు 3వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ 14 రోజుల పాటు శని-సూర్యుల ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందో ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
ఈ నక్షత్ర మార్పు కారణంగా ప్రధానంగా కన్య, తులా, మకరం, వృషభ రాశుల జాతకులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ప్రకాశించడమే కాకుండా…. ఈ 14 రోజులు వీరికి ఎంతో అనుకూలంగా మారనున్నాయి. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి….
కన్యా రాశి :
శని యొక్క పుష్య నక్షత్రంలో సూర్య సంచారం కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీకు ధన యోగం పడుతుంది. ఆర్థిక పరంగా ఊహించని ప్రయోజనాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులకు విద్యకు సంబంధించిన కొన్ని తీపి కబుర్లు అందుతాయి. మొత్తంగా ఈ సమయం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి :
తులారాశి వారికి కూడా ఈ నక్షత్ర మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆస్తి, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. మీ పనితీరు, చాకచక్యం మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. సమాజంలో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
మకర రాశి :
శని అధిపతిగా ఉండే మకర రాశి వారికి ఈ సమయం ఎంతో మంగళకరమైనది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి సహోద్యోగులు, భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వారి సేవ చేయడం వల్ల మీ ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
వృషభ రాశి :
వృషభ రాశి వారికి ఈ సంచారం చాలా సానుకూల మార్పులను తెస్తుంది. ఉద్యోగులు ఆఫీసులో తమ ప్రతిభను చాటుకుని, ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ మార్గాలు సుగమమై, ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

