అన్నాచెల్లెళ్ల ఆప్యాయతలను చాటిచెప్పే శ్రావణ పౌర్ణమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే రోజున అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి, వారి జీవితాంతం రక్షణగా ఉండాలని కోరుకుంటారు. అయితే రాఖీ కట్టే సమయంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. రక్షాసూత్రానికి సరిగ్గా మూడు ముళ్లు మాత్రమే ఎందుకు వేయాలి? కేవలం ఆచారమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే విషయాలపై ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశషాలు ఉన్నాయి.

మన సనాతన ధర్మంలో ప్రతి సంప్రదాయం వెనుక ఒక స్పష్టమైన శాస్త్రం ఉంటుంది. రాఖీకి వేసే మూడు ముళ్లు కేవలం అలంకరణ కాదు, అవి సాక్షాత్తూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకలుగా పెద్దలు చెబుతారు. "త్రిదేవ రక్ష కుర్వన్తు సర్వతు" అనే వేద మంత్రం ఆధారంగా ఈ ఆచారం తరతరాలుగా వస్తోంది. ఈ మూడు ముళ్లు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరింత బలపరచడంతో పాటు సోదరుడికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయని నమ్ముతారు.
మొదటి ముడి: బ్రహ్మ దేవుని ప్రతీక - ఆయురారోగ్యాలు
రాఖీ కట్టేటప్పుడు వేసే మొదటి ముడిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ప్రతీకగా భావిస్తారు. బ్రహ్మ సృష్టికి మూలం కనుక, ఈ మొదటి ముడి సోదరుడి దీర్ఘకాలిక ఆయుష్షును, మంచి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వేస్తారు. సోదరుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, ఆయన జీవితానికి పటిష్టమైన పునాది పడాలని కోరుకుంటూ సోదరి ఈ ముడి వేస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల ఉనికి ఎప్పుడూ సురక్షితంగా ఉండాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉంటుంది.
రెండవ ముడి: శ్రీ మహావిష్ణువు ప్రతీక - సిరిసంపదలు
రెండో ముడిని జగత్ రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా చెబుతారు. విష్ణుమూర్తి పాలనా శక్తికి, సంపదకు అధిపతి. సోదరుడి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఎల్లప్పుడూ సిరిసంపదలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ముడి వేస్తారు. విష్ణువు కృపతో అన్నగారి వ్యాపారం లేదా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుందని, ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఈ ముడి అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుంది.
మూడవ ముడి: పరమశివుడి ప్రతీక - మానసిక ప్రశాంతత
{{/usCountry}}రెండో ముడిని జగత్ రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా చెబుతారు. విష్ణుమూర్తి పాలనా శక్తికి, సంపదకు అధిపతి. సోదరుడి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఎల్లప్పుడూ సిరిసంపదలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ముడి వేస్తారు. విష్ణువు కృపతో అన్నగారి వ్యాపారం లేదా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుందని, ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఈ ముడి అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుంది.
మూడవ ముడి: పరమశివుడి ప్రతీక - మానసిక ప్రశాంతత
{{/usCountry}}చివరిదైన మూడో ముడి లయకారకుడు, పరమ శివుడితో ముడిపడి ఉంటుంది. శివుడు ప్రశాంతతకు, అలాగే దుష్ట శక్తులను సంహరించే శక్తికి ప్రతీక. సోదరుడి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేకుండా శత్రువుల నుంచి, చెడు శక్తుల నుంచి రక్షణ లభించాలని కోరుకుంటూ ఈ ముడి వేస్తారు. ఇలా త్రిమూర్తుల ఆశీస్సులతో కూడిన ఈ మూడు ముళ్లు సోదరుడికి ఆయువు, ఐశ్వర్యం, రక్షణను అందించే చక్రంలా పనిచేస్తాయి.
రాఖీ కట్టే సమయంలో పాటించాల్సిన నియమాలు
ఈ పవిత్రమైన పండుగ రోజు కేవలం రాఖీ కట్టడమే కాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల పూర్తి ఫలితం దక్కుతుంది. రాఖీని ఎప్పుడూ మంచి ముహూర్తంలోనే కట్టాలి, భద్ర కాలంలో కట్టకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం కాదు, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు కూర్చోవడం చాలా శుభప్రదం. సోదరి పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఉండవచ్చు. రాఖీ కట్టే వేళ మనసులో ఎలాంటి చెడు భావాలు లేకుండా కేవలం సోదరుడి మంచి కోరుకుంటూ పవిత్ర మనసుతో ఈ వేడుకను జరుపుకోవాలి.