హిందూ సనాతన ధర్మంలో దీపావళి పర్వదినానికి ముందు వచ్చే ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. ఆశ్వయుజ కృష్ణ పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని 'రమా ఏకాదశి'గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది ఏకాదశి తిథి రెండు రోజుల పాటు రావడం వల్ల భక్తుల్లో వ్రత తేదీపై కొంత గందరగోళం నెలకొంది.

హిందూ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ కృష్ణ పక్ష ఏకాదశి తిథి నవంబర్ 4, 2026 ఉదయం 11:03 గంటలకు ప్రారంభమై, నవంబర్ 5 ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది. తిథి రెండు రోజుల్లో వ్యాపించి ఉండటంతో కొందరు నవంబర్ 4న అని, మరి కొందరు నవంబర్ 5న వ్రతం చేయాలని చర్చిస్తున్నారు. అయితే సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం పండుగలు, వ్రతాలను నిర్ణయించడంలో 'ఉదయ తిథి'కి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పండితులు స్పష్టం చేస్తున్నారు.
నవంబర్ 5న రమా ఏకాదశి ఎందుకు?
సూర్యోదయ సమయంలో ఏ తిధి అయితే ఉంటుందో, ఆ రోజంతా ఆ తిథి వర్తిస్తుందని శాస్త్ర వచనం. నవంబర్ 4న సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి లేదు. అదే నవంబర్ 5న సూర్యోదయ వేళకు ఏకాదశి తిథి విధిగా లభిస్తోంది. అందుకే ఉదయ తిధి ప్రకారం రమా ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 5, 2026 గురువారం రోజే ఆచరించాలని పండితులు తేల్చిచెప్పారు. ఈ వ్రత విరమణ మరుసటి రోజు అంటే నవంబర్ 6న చేయాల్సి ఉంటుంది.
రమా ఏకాదశి పూజా ముహూర్తాలు
ఈ పవిత్రమైన రోజున భక్తులు భగవంతుని ఆరాధనకు అనువైన సమయాలను పరిశీలిస్తే..
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05:00 గంటల నుంచి ఉదయం 05:48 గంటల వరకు.
{{/usCountry}}బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05:00 గంటల నుంచి ఉదయం 05:48 గంటల వరకు.
{{/usCountry}}అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 గంటల నుంచి మధ్యాహ్నం 12:26 గంటల వరకు.
గోధూళి ముహూర్తం: సాయంత్రం 05:33 గంటల నుంచి సాయంత్రం 05:59 గంటల వరకు.
వ్రత పారణ సమయం
రమా ఏకాదశి వ్రత విరమణను నవంబర్ 6, 2026 శుక్రవారం రోజున చేయాలి. ఉదయం 06:37 గంటల నుంచి ఉదయం 08:48 గంటల మధ్యలో వ్రత విరమణ పూర్తి చేయడం అత్యంత శ్రేయస్కరం. ద్వాదశి తిథి ముగిసేలోపు వ్రతం విరమించాలని, లేనిపక్షంలో ధర్మ శాస్త్రాల ప్రకారం ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.
రమా ఏకాదశి విశిష్టత.. పూజాఫలం
'రమా' అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థం. ఈ ప్రత్యేకమైన రోజున జగద్రక్షకుడు శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మిని పూజించడం వల్ల గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి.
దరిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంతటి పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.