హిందూ సంప్రదాయంలో కార్తిక మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే ప్రతి పండగకు, వ్రతానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశేషం ఉంటుంది. ఇందులో భాగంగానే వచ్చే రోజుల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర పర్వదినం 'రమా ఏకాదశి'. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన రమా ఏకాదశి వ్రతం రాగా, మరుసటి రోజు నవంబర్ 6న ద్వాదశిని జరుపుకోనున్నారు.
రమా ఏకాదశి ప్రాముఖ్యత.. పూజా విధానం

ఆచార్య పండితుల సూచనల ప్రకారం.. ఏకాదశి తిథి నవంబర్ 5 ఉదయం 10:10 గంటల వరకు ఉండి, ఆ తర్వాత ద్వాదశి ప్రవేశిస్తుంది. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటప్పుడు తిథులలో దశమి కలవకుండా, ద్వాదశి స్పర్శ ఉండే రోజును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ పక్షంలో వచ్చే ఈ పరమ పావనమైన ఏకాదశికి 'రమా' అనే పేరుంది. 'రమా' అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థం.
సకల పాపాలను హరించే శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, అంతిమంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. చింతామణి, కామధేనువు ఏ విధంగానైతే కోరిన కోర్కెలు తీరుస్తాయో, ఈ రమా ఏకాదశి వ్రతం కూడా సకల మనోరథాలను సిద్ధింపజేస్తుందని ప్రతీతి.
ప్రత్యేక యోగాలు.. గ్రహస్థితులు
ఈ పవిత్రమైన రోజున కొన్ని విశేషమైన ఖగోళ, ఆధ్యాత్మిక యోగాలు కుదురుతున్నాయి. జ్యోతిష్య గణన ప్రకారం, ఈ రోజు ఉత్తరఫాల్గుణి నక్షత్రంతో పాటు బాల్వ కరణం ఉదయం 10:36 గంటల వరకు ఉంటుంది. చంద్రుడు ఉదయం 9:34 గంటల వరకు సింహ రాశిలో సంచరించి, ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రత్యేక గ్రహ స్థితి కారణంగా భక్తులకు పూజా ఫలం మరింత ఎక్కువగా లభిస్తుందని నమ్ముతారు.
గోవత్స ద్వాదశి విశేషాలు
రమా ఏకాదశి మరుసటి రోజైన నవంబర్ 6న 'గోవత్స ద్వాదశి'ని జరుపుకుంటారు. గోవును దైవంగా భావించే మన సంస్కృతిలో ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. సంతాన ప్రాప్తిని కోరుకునే దంపతులు ఈ రోజు ప్రత్యేకంగా ఆవును, దూడను పూజిస్తారు.
{{/usCountry}}రమా ఏకాదశి మరుసటి రోజైన నవంబర్ 6న 'గోవత్స ద్వాదశి'ని జరుపుకుంటారు. గోవును దైవంగా భావించే మన సంస్కృతిలో ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. సంతాన ప్రాప్తిని కోరుకునే దంపతులు ఈ రోజు ప్రత్యేకంగా ఆవును, దూడను పూజిస్తారు.
{{/usCountry}}ఇంటా బయటా సుఖ శాంతులు, సిరి సంపదలు వెల్లివిరియాలని కోరుకుంటూ గోమాతను పూజించడం హిందూ సనాతన ధర్మం ఇస్తున్న అందమైన సందేశం. ఈ పర్వదినాన గోవులకు తలస్నానం చేయించి, కుంకుమ తిలకం దిద్ది, పచ్చి గడ్డి లేదా తగిన ఆహారం తినిపించడం అత్యంత పుణ్యప్రదమని పెద్దలు చెబుతుంటారు.