ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులు భక్తిశ్రద్ధలతో శివారాధనకు సిద్ధమవుతారు. ఈ ఏడాది జూలై చివరి ప్రదోష వ్రతం అత్యంత పవిత్రమైన ఆదివారమే రావడం విశేషం. ఆదివారం నాడు వచ్చే ఈ ప్రదోష వ్రతాన్ని 'రవి ప్రదోష వ్రతం' అని పిలుస్తారు. ఆషాడ మాసంలో వచ్చే ఈ వ్రతాలకు ప్రత్యేకమైన శక్తి ఉందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన భోళా శంకరుడిని పూజించి, ప్రదోష కథను పఠించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.
ప్రదోష వ్రత కథా నేపధ్యం.. ఒక పేద బ్రాహ్మణుడి గాథ

పురాణాల ప్రకారం, ఒకానొక గ్రామంలో అత్యంత నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడి భార్య పరమ శివభక్తురాలు. ఎంతో నిష్టతో ఆమె క్రమం తప్పకుండా ప్రదోష వ్రతాలను ఆచరించేది. ఆ దంపతులకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. ఒకరోజు ఆ బాలుడు ఎవరికి చెప్పకుండా గంగా స్నానం కోసం ఒంటరిగా బయలుదేరాడు.
దారిలో కొందరు ఆ బాలుడిని చుట్టుముట్టారు. వాడి దగ్గర ఏదైనా దాచిన ధనం ఉందేమోనని అనుమానించి భయపెట్టారు. అయితే ఆ బాలుడు భయపడకుండా తాము అత్యంత పేదవాళ్ళమని, దాచుకోవడానికి తమ దగ్గర ఏమీ లేదని నిజం చెప్పాడు. దొంగలు అనుమానంతో బాలుడి చేతిలోని మూటను విప్పి చూడగా, అందులో వాళ్ళ అమ్మ కట్టిపెట్టిన రొట్టెలు మాత్రమే కనిపించాయి. బాలుడి మాటల్లోని నిజాయితీని గ్రహించిన దొంగలు అతనికి ఎలాంటి హాని చేయకుండా వదిలిపెట్టారు.
అనుకోని కష్టాలు.. శివుడి కటాక్షం
అక్కడి నుంచి ప్రయాణం సాగించిన ఆ బాలుడు సమీపంలోని ఒక నగరానికి చేరుకున్నాడు. అలసట కారణంగా అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో నిద్రపోయాడు. అదే సమయంలో ఆ నగరంలో దొంగల కోసం గాలిస్తున్న సైనికులు ఆ బాలుడిని చూశారు. అనుమానంతో అతడే దొంగ అని భావించి బందీగా రాజు ముందు ప్రవేశపెట్టారు. ఎలాంటి విచారణ జరపకుండానే రాజు ఆ బాలుడిని కారాగారంలో వేయాలని సైనికులను ఆదేశించాడు.
అదే రాత్రి బాలుడి తల్లి ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రదోషవ్రతం ఆచరిస్తూ శివధ్యానంలో గడిపింది. ఆ రాత్రి సమయంలో సాక్షాత్తు పరమశివుడు రాజు కలలో కనిపించాడు. బాలుడు పూర్తిగా నిర్దోషి అని, ఉదయమే అతన్ని విడుదల చేయాలని, లేకపోతే నీ రాజ్యంలోని వైభవమంతా నాశనమవుతుందని హెచ్చరించాడు.
దరిద్రం తొలగిపోయిన వైనం
{{/usCountry}}అదే రాత్రి బాలుడి తల్లి ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రదోషవ్రతం ఆచరిస్తూ శివధ్యానంలో గడిపింది. ఆ రాత్రి సమయంలో సాక్షాత్తు పరమశివుడు రాజు కలలో కనిపించాడు. బాలుడు పూర్తిగా నిర్దోషి అని, ఉదయమే అతన్ని విడుదల చేయాలని, లేకపోతే నీ రాజ్యంలోని వైభవమంతా నాశనమవుతుందని హెచ్చరించాడు.
దరిద్రం తొలగిపోయిన వైనం
{{/usCountry}}మరుసటి రోజు ఉదయం ఉలిక్కిపడి లేచిన రాజు వెంటనే ఆ బాలుడిని తన ముందుకు రప్పించి అసలు విషయం అడిగాడు. బాలుడు కన్నీళ్లతో జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్లు వివరించాడు. విషయం అర్థం చేసుకున్న రాజు తన సైనికులను పంపి బాలుడి తల్లిదండ్రులను రాజధానికి రప్పించాడు. వారికి తగిన గౌరవం ఇచ్చి, బాలుడు నిర్దోషి అని చెప్పి క్షమాపణలు కోరాడు.
ఆ పేద కుటుంబం పడుతున్న కష్టాలను చూసి చలించిన రాజు, వారికి ఏకంగా 5 గ్రామాలను దానంగా ఇచ్చాడు. శివుని కరుణ, ప్రదోష వ్రత ప్రభావం వల్ల ఆ నిరుపేద కుటుంబం సుఖసంతోమలతో కళకళలాడింది. ఈ కథ ద్వారా ప్రదోష వ్రత మహిమ ఏపాటిదో స్పష్టంగా తెలుస్తుంది.
పూజా విధానం మరియు విశిష్టత
ప్రదోష కాలంలో (సాయంత్రం వేళ) శివుని పూజించే సమయంలో ఈ కథను పఠించడం వల్ల వ్రత పూర్తి ఫలితం దక్కుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భక్తితో శివుడిని కొలిస్తే ఆ మహాదేవుడే స్వయంగా వచ్చి కాపాడుతాడనే నమ్మకానికి ఈ గాథ నిదర్శనం. రవి ప్రదోష వ్రతం రోజున ఈ కథను చదివి శివారాధన చేస్తే సర్వష్టాలు చేకూరుతాయి.