...
...
Next Story

కాలసర్ప దోషానికి పరిహారాలు ఇవి.. సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి

Kala Sarpa Dosham : కాలసర్ప దోషం అత్యంత అశుభ దోషాలలో ఒకటిగా పరిగణిస్తారు. రాహు కేతువుల ప్రభావంలో అన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. కాలసర్ప దోషం ఊహించని ఫలితాలకు దారితీయవచ్చు. పనిలో నిరంతర అడ్డంకులు, ఆటంకాలు ఎదురవడం కాలసర్ప దోషం సంకేతాలు.

Updated on: Apr 23, 2026, 18:49:35 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప దోషాన్ని అత్యంత అశుభకరమైన, వినాశకరమైన కలయికగా పరిగణిస్తారు. ఒక జాతకంలో రాహువు, కేతువుల మధ్య సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అనే ఏడు గ్రహాలు ఉండటం వల్ల కాలసర్ప దోషం ఏర్పడుతుంది. కాలసర్ప దోషం గ్రహాల కోణాలు.. రాహువు, కేతువుల మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక వ్యక్తిని 42 సంవత్సరాల వరకు ప్రభావితం చేయగలదని నమ్ముతారు.

కాలసర్పం దోషం పరిహారాలు
కాలసర్పం దోషం పరిహారాలు

ఒక గ్రహం రాహువు, కేతువుల మధ్య నుండి ప్రయాణించి అవతలి వైపునకు వెళ్లినప్పుడు దానిని అర్ధ కాలసర్ప దోషం అంటారు. ఈ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఆకస్మిక ఇబ్బందులు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటాడు. పనిలో నిరంతర అడ్డంకులు, వైఫల్యాలు కాలసర్ప దోషం సంకేతాలుగా చెబుతారు. కొన్ని పరిహారాల ద్వారా దీని ప్రభావాలను తగ్గించవచ్చు.

కాలసర్ప దోష రకాలు

కాలసర్ప దోషంలో 12 రకాలు ఉన్నాయి. వివిధ కాలసర్ప దోషాలకు వివిధ పరిహారాలు ఉపయోగిస్తారు.

  • అనంత కాలసర్ప దోషం
  • గుళిక కాలసర్ప దోషం
  • వాసుకి కాలసర్ప దోషం
  • శంఖపాల కాలసర్ప దోషం
  • పద్మ కాలసర్ప దోషం
  • మహాపద్మ కాలసర్ప దోషం
  • తక్షక కాలసర్ప దోషం
  • కర్కోటక కాలసర్ప దోషం
  • శంఖచూడ కాలసర్ప దోషం
  • ఘటక కాలసర్ప దోషం
  • విషధర కాలసర్ప దోషం
  • శేషనాగ కాలసర్ప దోషం

వీటిలో మహాపద్మ కాల సర్ప్ దోషం అత్యంత అశుభకరమైనదిగా చెబుతారు.

కాలసర్ప దోషానికి పరిహారాలు

కాలసర్ప దోష ప్రభావాలను తగ్గించుకోవడానికి, శివ భగవానునికి రుద్రాభిషేకం చేయండి. పాలు, తేనె, చెరకు రసం, నూనెతో ఈ అభిషేకాన్ని చేయవచ్చు. 'ఓం నమః శివాయ' మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి.

  • కాలసర్ప దోషం ఉన్నవారు అవకాశం దొరికినప్పుడల్లా ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • నాగ పంచమి రోజున శివలింగానికి పాలు, వెండి సర్పం సమర్పించండి. దీనివల్ల కాలసర్ప దోష ప్రభావాలు తగ్గుతాయి.
  • సోమవారం ఉపవాసం ఉండటం వల్ల కాలసర్ప దోషంతో బాధపడేవారికి కూడా ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
  • కాలసర్ప దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, రాహు కేతువుల మంత్రాలైన ఓం రహవే నమః, ఓం కేతవే నమః లను క్రమం తప్పకుండా జపించండి.
  • హనుమాన్ చాలీసా, మహామృత్యుంజయ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల కాల సర్ప దోషం ప్రభావం తగ్గుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe