Rice Remedy : గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చేసుకునే పరిహారాలు.. ఆటంకాలకు చెక్

Rice Remedy : సాధారణంగా కొందరు ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. అటువంటి పరిస్థితిలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి మీకు విజయం సాధించడానికి సహాయపడతాయి.

Published on: May 10, 2026, 12:46:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బియ్యం(అక్షతలు) లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గుప్పెడు బియ్యంతో చేసే కొన్ని సులభమైన పరిహారాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, అదృష్టాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు.

గుప్పెడు బియ్యంతో అదృష్టం
గుప్పెడు బియ్యంతో అదృష్టం

ప్రతి ఒక్కరూ జీవితంలో డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అలాగే సంతోషంగా జీవించాలని కూడా ఆశిస్తారు. కానీ ఈ కోరిక అందరిలోనూ నెరవేరదు. చాలా సందర్భాలలో ఒక వ్యక్తి నిరాశకు గురవుతాడు. డబ్బు సంపాదించి విజయం సాధించడం కోసం పగలూ రాత్రీ కష్టపడేవారు చాలామంది ఉన్నారు, కానీ వారు పదే పదే వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మీకు కూడా ఇలాగే జరుగుతూ, అదృష్టం మీతో లేకపోతే వంటగదిలో బియ్యంతో చేసే చిట్కాలు మీకు సహాయపడుతుంది. మీరు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు.

మీరు ఎంత కష్టపడినా పదే పదే వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్లయితే, బియ్యంతో ఈ ప్రత్యేక పరిహారాన్ని చేయండి. మీ అదృష్టాన్ని తట్టిలేపడంలో బియ్యం చాలా సహాయపడుతుంది. మీరు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలనుకుంటే, దీనికోసం ఒక రాగి పాత్ర తీసుకుని అందులో కొంచెం బియ్యం వేయండి. తర్వాత ఆ పాత్రను నీటితో నింపి, ఆ నీటితో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ఈ పరిహారాన్ని కొన్ని రోజుల పాటు నిరంతరం చేస్తే, అతని అదృష్టం మారుతుంది.

ఇది కాకుండా మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే, ప్రతి సోమవారం స్నానం చేసిన తర్వాత, అర కిలో బియ్యం తీసుకుని శివాలయం వెళ్లి శివలింగానికి గుప్పెడు బియ్యం సమర్పించండి. ఆ తర్వాత మిగిలిన బియ్యాన్ని పేదలకు దానం చేయండి. ఈ పరిహారాన్ని మీరు 5 సోమవారాల పాటు నిరంతరం పాటిస్తే మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు.

జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ప్రతిరోజూ ఉదయం ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని పక్షులకు ఆహారంగా వేయండి. దీనివల్ల పుణ్యం లభించడమే కాకుండా, మీపై ఉన్న ప్రతికూల శక్తి (Negative Energy) తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి.

మీ ఇంట్లోని బియ్యం డబ్బా ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకోండి. బియ్యం డబ్బాలో ఒక చిన్న వెండి నాణెం లేదా కనీసం ఒక రూపాయి బిళ్ళను వేసి ఉంచడం వల్ల ఇంట్లో ధాన్యానికి, ధనానికి లోటు ఉండదని అంటారు.

ఈ పరిహారాలు చేసేటప్పుడు బియ్యం శుభ్రంగా, విరగకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వీటిని పూర్తి నమ్మకంతో, రియు భక్తితో చేసినప్పుడే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More