...
...
Next Story

వినాయక చవితికి ముందు ఇంటి నుంచి ఈ 8 వస్తువులను తొలగించండి.. గణపతి అనుగ్రహం పొందండి!

విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, పనుల్లో ఆటంకాలు తొలగి కుటుంబంలో సంతోషం నెలకొంటుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని చవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14, సోమవారం వచ్చింది

Published on: Sep 9, 2026, 14:00:22 IST
Advertisement

విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. పనుల్లో కలిగే ఆటంకాలు తొలగిపోయి, అన్ని పనులను సమయానికి పూర్తి చేయొచ్చు. అలాగే, వినాయకుని ఆరాధించడం వలన ఆ వినాయకుని అనుగ్రహంతో కుటుంబమంతా సంతోషంగా ఉండొచ్చు.

వినాయక చవితికి ముందు ఇంటి నుంచి ఈ 8 వస్తువులను తొలగించండి.. గణపతి అనుగ్రహం పొందండి! (AI)
వినాయక చవితికి ముందు ఇంటి నుంచి ఈ 8 వస్తువులను తొలగించండి.. గణపతి అనుగ్రహం పొందండి! (AI)

వినాయక చవితి రాబోతోంది. ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14, సోమవారం నాడు వచ్చింది. వినాయక చవితికి ముందే ఇంటి నుంచి వస్తువులను తొలగించడం మంచిది. ఇలా చేయడం వలన ఆ గణపతి అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

వినాయక చవితికి ముందే ఈ వస్తువులను ఇంటి నుంచి తొలగించండి.. గణపతి అనుగ్రహాన్ని పొందండి

వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వినాయక చవితికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగిస్తే ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగించి, అనుకూల శక్తిని పొందవచ్చు.

1.ఎండిపోయిన మొక్కలు

ఇంట్లో ఎప్పుడూ కూడా పచ్చని మొక్కలు, అందమైన పూలు ఉండాలి. ఇవి పాజిటివిటీని పెంచుతాయి. అదే ఎండిపోయిన మొక్కలు, ఆకులు వంటివి ఉంటే అవి ప్రతికూల శక్తికి కారణమవుతాయి. ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండదు. కాబట్టి, వినాయక చవితికి ముందే ఇంటి నుంచి తొలగించడం మంచిది.

2.పగిలిపోయిన వస్తువులు

ఇంట్లో పగిలిన వస్తువులు ఉండకూడదు. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణమవుతాయి. కాబట్టి, అలాంటి వాటిని ఇంటి నుంచి తొలగించండి.

3.పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు

పొరపాటున కూడా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

4.విరిగిపోయిన విగ్రహాలు

పగిలిన, దెబ్బతిన్న దేవతా విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. వీటిని కూడా ఇంటి నుంచి తొలగించాలి. గౌరవంగా వీటిని ఇంటి నుంచి తీసేయొచ్చు.

5.పాత బట్టలు

ఎప్పుడూ ఉపయోగించనివి, పనికిరానివి, చిరిగిపోయినవి ఎవరికైనా ఇచ్చేయడం మంచిదే. ఇటువంటి బట్టలు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. కాబట్టి, వినాయక చవితికి ముందే వీటిని కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది.

6.పాడైపోయిన చెప్పులు

పనిచేయని గడియారాలు ఉంటే కూడా తొలగించడం మంచిదే. లేదా వాటిని రిపేర్ చేయించి పెట్టుకుంటే మంచిది. లేదంటే ప్రతికూల శక్తికి కారణమవుతాయి.

8.పేరుకుపోయిన అనవసరమైన వస్తువులు

ఇంట్లో ఉపయోగించని, అనవసరమైన వస్తువులను కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణమవుతాయి. సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks