Ugadi 2026: ఉగాదికి ముందే ఇంటి నుంచి ఈ ఏడింటినీ తొలగించండి.. ఇక అన్నీ శుభ ఫలితాలే!
Ugadi 2026: నిజానికి పండుగ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజలు చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అందరూ కలిసి సరదాగా సమయాన్ని గడపడం. ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఉగాదికి ముందు కూడా కొన్ని పాటించాలి. ముఖ్యంగా వీటిని ఇంటి నుంచి తొలగించాలి. లేదంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అందరూ బాగా కలిసి రావాలని, అన్ని విధాలుగా మంచి జరగాలని భావిస్తారు. అందుకని ఉగాది నాడు కొన్ని తప్పులు చేయకుండా చూసుకుంటారు. అలాగే కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

అయితే ఉగాది నాడు మంచి జరగాలన్నా, కొత్త తెలుగు సంవత్సరం మొత్తం కలిసి రావాలన్నా ఇంట్లో నుంచి కొన్నిటిని తొలగించడం మంచిది. ఉగాదికి ముందు ఇంటి నుంచి పెట్టిన వాటిని తొలగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.
ఉగాదికి ముందే ఇంటి నుంచి వీటిని తొలగిస్తే అన్నీ శుభ ఫలితాలే
నిజానికి పండుగ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజలు చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అందరూ కలిసి సరదాగా సమయాన్ని గడపడం. ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఉగాదికి ముందు కూడా కొన్ని పాటించాలి. ముఖ్యంగా వీటిని ఇంటి నుంచి తొలగించాలి. లేదంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. ఉగాది అంటే కొత్త ప్రారంభం. ఉగాది నుంచి కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి. ఉగాదికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
1.పాత సామాన్లు:
విరిగిపోయిన, పనికిరాని సామాన్లు చాలా మంది ఇళ్లల్లో ఉంచుతారు. పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన సామాన్లు, పనికిరాని ఎలక్ట్రానిక్ సామాన్లు వంటివి తొలగించాలి. ఇవి సానుకూల శక్తిని ఆపి, ప్రతికూల శక్తి వ్యాపించేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని తొలగించాలి.
2.పాత గడియారాలు, క్యాలెండర్లు:
కొత్త తెలుగు సంవత్సరం వస్తుంది కాబట్టి పాత క్యాలెండర్లు, పనికిరాని గడియారాలు వంటివి ఇంటి నుంచి తొలగించాలి. లేకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
3.పాత చెప్పులు, దుస్తులు:
చాలా మంది ఇళ్లల్లో పాత చెప్పులు, సరిపోని దుస్తులు, పనికిరాని వస్తువులు పెడుతూ ఉంటారు. వీటివల్ల ఇంట్లో స్థలం వృథా తప్ప ఉపయోగం లేదు. పైగా ఇవి ప్రతికూల శక్తికి కూడా కారణం అవుతాయి. సానుకూల శక్తిని తొలగిస్తాయి.
4.పూజ గది శుభ్రత:
పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ గది శుభ్రంగా లేకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. వాడిపోయిన పువ్వులు, విరిగిపోయిన దేవుడి విగ్రహాలు వంటివి తొలగించి పూజ గదిని శుభ్రంగా ఉంచితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
5.ఇంటి ముఖద్వారం:
ఇంటి ముఖద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ముఖద్వారం శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. పైగా నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఇంటి ముఖద్వారం అందంగా ఉండాలి. మామిడి తోరణాలతో ముఖద్వారం అందంగా ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసి అలంకరించినట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
6.కర్టెన్లు, బెడ్ షీట్లు:
కర్టెన్లు వెంటనే శుభ్రం చేయాలి. కర్టెన్లు వంటివి మురికిగా ఉండకూడదు. బెడ్ షీట్లు, సోఫా కవర్లు వంటివి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. లేకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
7.చెత్త, దుమ్ము:
ఇంట్లో చెత్త, దుమ్ము వంటివి ఉంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. ఉగాదికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం, వీటిని పాటించడం చాలా అవసరం. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బందులతో సతమతమవ్వాల్సి ఉంటుంది. ఇల్లు స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంటే అన్నీ కలిసి వస్తాయి. పైగా సుఖసంతోషాలను పొందవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












