సనాతన ధర్మంలో ఈ 5 మహాదానాలకు ఎంతో విశిష్టత.. ఏ దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందంటే?

సనాతన ధర్మంలో దానధర్మాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, నిరుపేదలకు వస్త్రాలు అందించడం, దేవాలయాల్లో దీపారాధనకు నూనె లేదా నెయ్యి సమర్పించడం, గోశాలల్లో గోవులకు ఆహారం అందించడం, ఆలయ సేవల్లో సమయం,  

Published on: Oct 11, 2026, 11:00:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సనాతన సంప్రదాయంలో దానధర్మానికి విశేషమైన స్థానం ఉంది. ఇది పుణ్యాన్ని ఆర్జించడంతో పాటు తోటి మనుషుల అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన మార్గం. నిస్వార్థ భావంతో, శ్రద్ధగా చేసే ప్రతి దానం మనిషి జీవితంలో సుఖ స్రామ్రాజ్యాలను, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది.

సనాతన ధర్మంలో ఈ 5 మహాదానాలకు ఎంతో విశిష్టత.. ఏ దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందంటే?
సనాతన ధర్మంలో ఈ 5 మహాదానాలకు ఎంతో విశిష్టత.. ఏ దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందంటే?

దానం అంటే కేవలం డబ్బును దానం చేయడమే కాదు, మరొకరి ఆకలి తీర్చడం, సహాయం కోసం మన సమయాన్ని కేటాయించడం కూడా దానమే కింద లెక్కగట్టవచ్చు. పుణ్యక్షేత్రాలలో మరియు దేవాలయాలలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు ప్రాప్తిస్తాయని మన ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. ఆ ఐదు మహాదానాల గురించి వివరంగా తెలుసుకుందాం.

అన్నదానం - సర్వశ్రేష్టమైన దానం

సనాతన సంప్రదాయంలో అన్నదానాన్ని అన్ని దానాలకంటే అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. దేవాలయాలలో ధాన్యం, పప్పు దినుసులు, బియ్యం లేదా వండిన భోజనాన్ని దానం చేయడం వల్ల అన్నసంతర్పణ, భండారాల నిర్వహణ సజావుగా సాగుతుంది. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం అందుతుంది. ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదని పెద్దలు చెబుతుంటారు. ఈ దానం ద్వారా ఇతరుల ఆకలి తీరడంతో పాటు మనసులో దయ, సేవ భావం వృద్ధి చెందుతాయి.

వస్త్ర దానం - కరుణకు ప్రతీక

దేవాలయాలు మరియు పేద ప్రజలకు వస్త్రాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నిరుపేదలకు, అవసరమైన వారికి బట్టలు ఇవ్వడం ద్వారా వారు కాలానికి తగినట్టుగా తమ శరీరాన్ని రక్షించుకోగలుగుతారు. సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా ఇది గౌరవం, కరుణతో ముడిపడి ఉన్న గొప్ప సేవ. గుడిలోని పూజారులు, సిబ్బంది మరియు నిస్సహాయులకు శుభ్రమైన వస్త్రాలను దానం చేయవచ్చు. ఎలాంటి అహంభావం, ప్రదర్శన లేకుండా నిస్వార్థంగా చేసే వస్త్రదానం మనిషిలోని గర్వాన్ని అణిచివేస్తుంది.

దీపారాధన కోసం నూనె లేదా నెయ్యి దానం

హిందూ ధర్మంలో దీపాన్ని కాంతికి, అంధకారాన్ని పారద్రోలే విజయానికి ప్రతీకగా భావిస్తారు. దేవాలయాలలో నిత్య దీపారాధనకు అవసరమైన నూనె లేదా నెయ్యిని దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. భక్తులు ఆవనూనె, నువ్వుల నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు. దీనివల్ల గుడిలో నిత్యం దీపాలు వెలిగించే సేవ నిరంతరం కొనసాగుతుంది. దీపపు కాంతి జ్ఞానానికి, సానుకూల శక్తికి సంకేతం కాబట్టి ఈ దానం దైవ సేవలో భాగమవుతుంది.

గోసేవ - సమస్త జీవుల పట్ల దయ

సనాతన ధర్మంలో గోమాతకు దైవిక స్థానం ఉంది. అనేక దేవాలయాలలో గోశాలలు ఉంటాయి, అక్కడ ఆవులను అత్యంత శ్రద్ధగా చూసుకుంటారు. అలాంటి చోట ఆవుల కోసం దాణా, పచ్చగడ్డి, తౌడు వంటి వాటిని దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. గోసేవ అనేది జీవుల పట్ల దయ, కరుణకు నిదర్శనం. మన శక్తికొద్దీ గోశాలలకు సరుకులు సమకూర్చడం ద్వారా గోమాత ఆశీస్సులు లభిస్తాయి.

ఆలయంలో సమయం మరియు శ్రమ దానం

దానం అంటే కేవలం ధనం లేదా వస్తువులు మాత్రమే కాదు. దేవాలయాలను శుభ్రం చేయడం, అన్నదాన సమయంలో వడ్డించడం, పెద్దవారికి సహాయం చేయడం, ఆలయ నిర్వహణలో పాలుపంచుకోవడం కూడా అత్యంత కీలకమైన సేవలే. దీన్ని 'శ్రమదానం' లేదా 'సేవా దానం' అంటారు. ఇందులో భక్తులు స్వచ్ఛందంగా తమ సమయాన్ని, శ్రమిస్తారు. ఈ రకమైన నిస్వార్థ సేవ చేయడం వల్ల మనసులో వినమ్రత పెరుగుతుంది, అహం భావం నశిస్తుంది.

భగవంతునికి చేరువ కావడానికి ఈ ఐదు మహాదానాలు చక్కటి మార్గాలు. మీ జీవితంలో తరచూ ఎదురవుతున్న మానసిక ఒత్తిడి, సమస్యలు తొలగిపోవాలంటే మీ సామర్థ్యం మేరకు అన్నదానం, వస్త్రదానం, దీప దానం, గోసేవ లేదా సమయాన్ని దానం చేయడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More