శ్రవణ నక్షత్రం+ శుక్రవారం+సంకష్ట చతుర్థి: గణపతి అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలి?
జూలై 3, 2026 సంకష్టి చతుర్థి సందర్భంగా 12 రాశుల వారు గణపతి అనుగ్రహం కోసం చేయాల్సిన ప్రత్యేక పరిహారాలు తెలుసుకోండి. ఏ రాశి వారు ఏ నైవేద్యం, ఏ అభిషేకం, ఏ మంత్రం చేయాలో పూర్తి వివరాలు చదవండి.
ఈరోజు శ్రవణ నక్షత్రం, శుక్రవారం, సంకష్టి చతుర్థికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు గణపతిని ఆరాధించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జూలై 3, 2026న అనగా ఈరోజు వచ్చిన సంకష్టి చతుర్థికి ఎంతో ప్రత్యేకత వుంది. ఈ రోజున మీ రాశిని బట్టి చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా గణనాథుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు.

సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత
సాధారణంగా సంకష్టి చతుర్థి వ్రతాన్ని సంతాన సౌభాగ్యం కోసం, కుటుంబంలో సుఖశాంతుల కోసం తల్లులు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఈ రోజున విఘ్నేశ్వరుడితో పాటు చంద్రుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. భక్తులు ఉదయం నుండే ఉపవాస దీక్షను చేపట్టి, చంద్రోదయం తర్వాతే భోజనం చేస్తారు.
మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారాలు
గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలంటే మీ రాశికి అనుగుణంగా ఈ క్రింది పూజా కార్యక్రమాలను నిర్వహించండి:
మేష రాశి: గంగాజలంతో వినాయకుడికి అభిషేకం చేసి, తప్పనిసరిగా దూర్వా యజ్ఞం (గరిక) సమర్పించండి.
వృషభ రాశి: గణపతికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
మిథున రాశి: శనగపిండితో చేసిన లడ్డూలను వినాయకుడికి నివేదించండి. వినాయకుడి అనుగ్రహం పొందవచ్చు.
కర్కాటక రాశి: గణనాథుని ఆశీస్సుల కోసం దూర్వాలతో అర్చన చేయడం శ్రేయస్కరం.
సింహ రాశి: 'ఓం గం గణపతయే నమః' మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ, పంచామృతంతో గణపతికి అభిషేకం చేయండి.
కన్యా రాశి: వినాయకుడికి పసుపు రంగు గంధాన్ని పూసి పూజించడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.
తులా రాశి: పచ్చి పాలు, గంగాజలంతో గణపతికి అభిషేకం చేసి భక్తితో పూజించండి.
వృశ్చిక రాశి: పెరుగు, తేనెతో స్వామికి అభిషేకం చేసి, 'ఓం గణేశాయ నమః' అని స్మరించండి.
ధనస్సు రాశి: పసుపు రంగు వస్త్రాలు, పుష్పాలను స్వామికి సమర్పించి ప్రార్థించండి.
మకర రాశి: గణేశ చాలీసాను పఠించడం ద్వారా స్వామి కటాక్షం లభిస్తుంది.
కుంభ రాశి: స్వామికి మోదకాలను నైవేద్యంగా పెట్టి, దూర్వాలను సమర్పించండి.
మీన రాశి: పరమాన్నాన్ని (క్షీరన్నం) నైవేద్యంగా సమర్పించడం మీ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


