సంకటహర చతుర్థి + శుక్రవారం + ఆరుద్ర నక్షత్రం.. నేడు బెల్లం దీపం, ఈ 3 మంత్రాలతో వినాయకుడి అనుగ్రహం!

సంకటహర చతుర్థి, శుక్రవారం, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన ఈరోజు ఆధ్యాత్మికంగా విశేషమైన రోజుగా భావిస్తారు. ఈ సందర్భంగా వినాయకుడిని భక్తితో పూజించడం వల్ల విఘ్నాలు తొలగి, చేపట్టిన పనులు విజయవంతమవుతాయని భక్తుల నమ్మకం.  

Published on: Nov 27, 2026, 13:23:32 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సంకటహర చతుర్థి: వినాయకుడిని పూజించడం వలన పనుల్లో ఉండే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోయి, పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం వలన వినాయకుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేయొచ్చు. మీ పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంతకీ ఈ రోజు విశిష్టత ఏంటి? ఈరోజు వచ్చిన శుభయోగాలు ఏవి? ఈరోజు ఏం చేయాలి? ఇలాంటి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం.

సంకటహర చతుర్థి + శుక్రవారం + ఆరుద్ర నక్షత్రం.. నేడు బెల్లం దీపం, ఈ 3 మంత్రాలతో వినాయకుడి అనుగ్రహం! (AI)
సంకటహర చతుర్థి + శుక్రవారం + ఆరుద్ర నక్షత్రం.. నేడు బెల్లం దీపం, ఈ 3 మంత్రాలతో వినాయకుడి అనుగ్రహం! (AI)

సంకటహర చతుర్థి+ శుక్రవారం+ ఆరుద్ర నక్షత్రం

ఈరోజు సంకటహర చతుర్థి+ శుక్రవారం+ ఆరుద్ర నక్షత్రం. శివపార్వతుల జన్మ నక్షత్రం ఉన్న విశేషమైన రోజు. పైగా సంకటహర చతుర్థి కూడా కలిసి వచ్చింది. అందులోనూ శుక్రవారం చాలా మంచిది. అయితే, ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఈ పరిహారాలను పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వినాయకుడిని పూజించడం వలన అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేయొచ్చు. సక్సెస్‌ను త్వరగా పొందడానికి వీలవుతుంది. అలాగే, ఈరోజు శివాలయానికి వెళ్లి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

వినాయకుడికి బెల్లం దీపం పెట్టండి

వినాయకుడికి బెల్లం దీపం వెలిగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. వినాయకుడి అనుగ్రహంతో చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. బెల్లం దీపాన్ని వినాయకుడికి వెలిగించడం వలన ఐశ్వర్యం కూడా కలుగుతుంది. శుక్రవారం నాడు, పౌర్ణమి రోజుల్లో కూడా ఈ బెల్లం దీపాన్ని వెలిగించవచ్చు.

బెల్లం దీపం ఎలా వెలిగించాలి?

శుభ్రమైన ప్రమిదను తీసుకుని, కొంచెం బెల్లం ముక్క లేదా బెల్లం తురుము వేసి, నెయ్యి పోసి, పత్తి వత్తిని నెయ్యిలో తడిపి ప్రమిదలో పెట్టాలి. భక్తితో వినాయకుడిని స్మరిస్తూ ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా బెల్లం దీపాన్ని వినాయకుడి ముందు ఈరోజు వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి.

ఈరోజు సంకటహర చతుర్థి వేళ ఈ వినాయక మంత్రాలను కూడా జపించండి

ఈ వినాయక మంత్రాలను 11, 21 లేదా 108 సార్లు జపించవచ్చు. మీకు ఉన్న సమయాన్ని బట్టి మీరు మంత్రాలను జపించండి. ఈ మంత్రాలను జపించడం వలన వినాయకుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

- ఓం సిద్ధి వినాయక నమః

- ఓం గం గణపతయే నమః

- ఓం గణాధిపాయ నమః

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు