శని, శుక్రుల కలయిక 5 రాశుల అదృష్టాన్ని పెంచుతుంది, అర్ధ కేంద్ర రాజయోగం అద్భుతమైన పురోగతిని తీసుకొస్తుంది!
శని, శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉండడం చాలా శుభప్రదమైనది. ఫిబ్రవరి 22న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 4న శుక్రుడు కూడా ప్రవేశించడంతో ఈ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ యోగం కొన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, ఫిబ్రవరి 22న శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అదే నక్షత్రంలోకి శుక్రుడు మార్చి 4న ప్రవేశిస్తాడు. దాంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడి అర్థకేంద్ర రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ శుభయోగం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపించినప్పటికీ, ఐదు రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. అర్థకేంద్ర రాజయోగం ఈ రాశుల వారికి వరంలా మారనుంది.

అర్ధ కేంద్ర రాజయోగం
శని, శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉండడం చాలా శుభప్రదమైనది. ఫిబ్రవరి 22న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 4న శుక్రుడు కూడా ప్రవేశించడంతో ఈ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ యోగం కొన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. శుక్రుడు, శని కలయికతో ఏర్పడే ఈ రాజయోగం కెరీర్‌లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. పూర్వికుల ఆస్తి సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలను పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎప్పటి నుంచో విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మునుపటికంటే మరింత దృఢంగా మారతారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రెండు గ్రహాల కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధం బాగుంటుంది. ఆర్థికపరంగా బలపడతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సక్సెస్‌ను అందుకుంటారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఇది శుభప్రదమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వివిధ లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇలా ఒకటే కాదు, అనేక లాభాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి కూడా ఇది శుభప్రదమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


