న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, ప్రవర్తన గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, సెప్టెంబర్ నెలలో కొన్ని సంఖ్యల్లో పుట్టిన వారికి బాగుంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. మరి సెప్టెంబర్ నెలలో ఏ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకంగా ఉండబోతోంది? ఎవరికి మేలు కలగబోతోంది? ఏ విధంగా లాభాలు కలుగుతాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తేదీల్లో పుట్టిన వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది.. శుభ ఫలితాలను చూస్తారు
మూలాంకం 1

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఒకటి అవుతుంది. సెప్టెంబర్ నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. పదోన్నతికి సంబంధించి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
మూలాంకం 2
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ నెలలో మనశ్శాంతి లభిస్తుంది. ఎప్పటినుంచో ఉన్న టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం. చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు.
మూలాంకం 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఐదు అవుతుంది. పురోగతికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఉద్యోగులకు కెరీర్‌లో ఎదుగుదల అవకాశాలు లభిస్తాయి.
మూలాంకం 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఆరు అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సుఖసంతోషాలు ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మధురంగా మారుతాయి.
మూలాంకం 7
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 7 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
మూలాంకం 8
{{/usCountry}}ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 7 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
మూలాంకం 8
{{/usCountry}}ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చదువు, ఉద్యోగం, ఇతర పనులపై ఏకాగ్రత మెరుగుపడుతుంది.