సెప్టెంబర్‌లో ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం.. కెరీర్, డబ్బు, ఉద్యోగంలో శుభ ఫలితాలు!
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, ప్రవర్తన, జీవితంలోని పలు అంశాల గురించి తెలుసుకోవచ్చని నమ్మకం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, 2026 సెప్టెంబర్ నెలలో మూలాంకం 1, 2, 5, 6, 7, 8 ఉన్న వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, ప్రవర్తన గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, సెప్టెంబర్ నెలలో కొన్ని సంఖ్యల్లో పుట్టిన వారికి బాగుంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. మరి సెప్టెంబర్ నెలలో ఏ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకంగా ఉండబోతోంది? ఎవరికి మేలు కలగబోతోంది? ఏ విధంగా లాభాలు కలుగుతాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తేదీల్లో పుట్టిన వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది.. శుభ ఫలితాలను చూస్తారు
మూలాంకం 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఒకటి అవుతుంది. సెప్టెంబర్ నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. పదోన్నతికి సంబంధించి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
మూలాంకం 2
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ నెలలో మనశ్శాంతి లభిస్తుంది. ఎప్పటినుంచో ఉన్న టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం. చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు.
మూలాంకం 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఐదు అవుతుంది. పురోగతికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఉద్యోగులకు కెరీర్‌లో ఎదుగుదల అవకాశాలు లభిస్తాయి.
మూలాంకం 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఆరు అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సుఖసంతోషాలు ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మధురంగా మారుతాయి.
మూలాంకం 7
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 7 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
మూలాంకం 8
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చదువు, ఉద్యోగం, ఇతర పనులపై ఏకాగ్రత మెరుగుపడుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


