ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరి 15 రోజుల్లో గ్రహాల కదలికల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన స్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రెండు వారాల వ్యవధిలో కొన్ని రాశుల వారు వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చిన్నచిన్న విషయాలకే కోపానికి గురికావడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రశాంతంగా, యోచించి అడుగులు వేయడం మంచిది. ఈ కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఆ 5 రాశుల వివరాలు ఇవే….
మేష రాశి :

ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ, పిల్లల వ్యవహారాల్లో చాలా ఓపికగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఉన్న వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఈ సమయంలో శత్రువుల నుంచి వ్యతిరేకత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున జరిగే నష్టాలను నివారించవచ్చు.
వృషభ రాశి :
వృషభ రాశి వారి జీవితంలో ప్రేమ వ్యవహారాలు కొద్దిగా తలకిందులయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారి ప్రవర్తనలో కఠినత్వం మిమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేయవచ్చు. పిల్లల చదువు, ఆరోగ్యం లేదా ప్రవర్తనలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. అలాంటి సమయంలో ధైర్యంగా, విచక్షణతో వ్యవహరించాలి కానీ సహనాన్ని కోల్పోకూడదు.
మిథున రాశి :
మిథున రాశి వారు ఇంట్లో తలెత్తే వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ 15 రోజుల వ్యవధిలో కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. కొత్తగా భూమి లేదా వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి కీలకమైన నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.
తులారాశి :
తులారాశి వారికి ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులతో గానీ, కార్యాలయాల్లో పైఅధికారులతో గానీ ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అధికారుల అగ్రహానికి గురైతే పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని తొందరపడకుండా, నిపుణుల సలహాతో తీసుకోండి.
కుంభ రాశి :
{{/usCountry}}తులారాశి వారికి ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులతో గానీ, కార్యాలయాల్లో పైఅధికారులతో గానీ ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అధికారుల అగ్రహానికి గురైతే పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని తొందరపడకుండా, నిపుణుల సలహాతో తీసుకోండి.
కుంభ రాశి :
{{/usCountry}}కుంభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో సంబంధాలు కొంత ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పుడు సమాచారం లేదా తొందరపాటు కారణంగా కీలకమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి.