ఈ సెప్టెంబర్ ఆఖరి 15 రోజులు... ఈ 5 రాశుల వారు పొరపాటున కూడా తొందరపడకండి!

సెప్టెంబర్ మిగిలిన రోజుల్లో మేషం, వృషభం సహా 5 రాశుల వారు తీవ్ర హెచ్చుతగ్గులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ హెచ్చరించారు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Published on: Sep 15, 2026, 08:07:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరి 15 రోజుల్లో గ్రహాల కదలికల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన స్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రెండు వారాల వ్యవధిలో కొన్ని రాశుల వారు వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చిన్నచిన్న విషయాలకే కోపానికి గురికావడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రశాంతంగా, యోచించి అడుగులు వేయడం మంచిది. ఈ కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఆ 5 రాశుల వివరాలు ఇవే….

ఈ 5 రోజులవారికి అలర్ట్ - జాగ్రత్తగా ఉండాల్సిందే
ఈ 5 రోజులవారికి అలర్ట్ - జాగ్రత్తగా ఉండాల్సిందే

మేష రాశి :

ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ, పిల్లల వ్యవహారాల్లో చాలా ఓపికగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఉన్న వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఈ సమయంలో శత్రువుల నుంచి వ్యతిరేకత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున జరిగే నష్టాలను నివారించవచ్చు.

వృషభ రాశి :

వృషభ రాశి వారి జీవితంలో ప్రేమ వ్యవహారాలు కొద్దిగా తలకిందులయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారి ప్రవర్తనలో కఠినత్వం మిమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేయవచ్చు. పిల్లల చదువు, ఆరోగ్యం లేదా ప్రవర్తనలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. అలాంటి సమయంలో ధైర్యంగా, విచక్షణతో వ్యవహరించాలి కానీ సహనాన్ని కోల్పోకూడదు.

మిథున రాశి :

మిథున రాశి వారు ఇంట్లో తలెత్తే వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ 15 రోజుల వ్యవధిలో కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. కొత్తగా భూమి లేదా వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి కీలకమైన నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.

తులారాశి :

తులారాశి వారికి ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులతో గానీ, కార్యాలయాల్లో పైఅధికారులతో గానీ ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అధికారుల అగ్రహానికి గురైతే పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని తొందరపడకుండా, నిపుణుల సలహాతో తీసుకోండి.

కుంభ రాశి :

కుంభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో సంబంధాలు కొంత ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పుడు సమాచారం లేదా తొందరపాటు కారణంగా కీలకమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More