...
...
Next Story

Swapna shastra: శనికి సంబంధించిన ఈ 4 కలలు వస్తే శుభమా, అశుభమా? స్వప్నశాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకోండి!

నిద్రపోయినప్పుడు మంచి కలలు, చెడ్డ కలలు రెండూ వస్తుంటాయి. కొన్ని సార్లు చాలా ప్రశాంతంగా, సంతోషాన్ని ఇచ్చే కలలు వస్తే, కొన్నిసార్లు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. శని దేవుడికి సంబంధించిన ఈ కలలు వస్తే దానికి అర్థం ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Dec 5, 2025, 12:00:04 IST
Advertisement

మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు గుర్తుంచుకుంటే, కొన్ని మర్చిపోతూ ఉంటాము. అయితే మనకు వచ్చే కల కూడా చాలా విషయాలను తెలుపుతుంది. కలల ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభప్రదమైనవిగా, కొన్ని కలలు అశుభమైనవిగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం శని దేవుడికి సంబంధించిన ఇలాంటి కలలు వస్తే, అది మంచిదా, చెడ్డదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

swapna shastra: శనికి సంబంధించిన ఈ కలలు శుభమా? అశుభమా? (pinterest)
swapna shastra: శనికి సంబంధించిన ఈ కలలు శుభమా? అశుభమా? (pinterest)

నిద్రపోయినప్పుడు మంచి కలలు, చెడ్డ కలలు రెండూ వస్తుంటాయి. కొన్ని సార్లు చాలా ప్రశాంతంగా, సంతోషాన్ని ఇచ్చే కలలు వస్తే, కొన్నిసార్లు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. శని దేవుడికి సంబంధించిన ఈ కలలు వస్తే దానికి అర్థం ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

శనికి సంబంధించిన ఈ కలలు శుభమా? అశుభమా? ఈ కలలు తెలిపే సంకేతాలు గురించి తెలుసుకోండి

1.కలలో శని దేవుడు

న్యాయానికి అధిపతి అయినట్లైన శని దేవుడు కనపడినట్లయితే, అది శుభం. శని దేవుడు కలలో కనపడితే శని దేవుని అనుగ్రహం ఉంటుందని, సక్సెస్‌ అందుకోవచ్చని, సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుందని అర్థం చేసుకోవాలి.

2.కలలో ఆవాలు నూనె

శని దేవుడికి ఆవాలు నూనె అంటే ఎంతో ఇష్టం. శని దేవుడిని పూజించేటప్పుడు ఆవాలు నూనె సమర్పిస్తారు, ఆవాల నూనెలో దీపారాధన చేస్తారు. ఆవాలు నూనె కలలో కనపడినట్లయితే ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి, డబ్బు మీతో కలసి ఉంటుందని అర్థం చేసుకోవాలి, మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని అర్థం చేసుకోవాలి. అదే ఒకవేళ ఆవాలు నూనె రాసుకుంటున్నట్లుగా కల వచ్చినట్లయితే మాత్రం సమస్యలు వస్తాయని స్వప్నశాస్త్రం తెలుపుతోంది.

3.కలలో శివలింగం

కలలో నల్ల కుక్క కనపడితే కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుందని అర్థం చేసుకోవాలి. నల్ల కుక్క కనపడితే శని దేవుని అనుగ్రహం వారిపై ఉందని భావించాలి. అలాగే నల్ల కుక్క ఎవరితోనైనా ఆడుకుంటున్నట్లు కనపడితే, కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు, నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు అని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe