...
...
Next Story

Shani Dev Favorite Flowers: ఈ పువ్వులంటే శనికి ఎంతో ఇష్టం.. వీటిని సమర్పిస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది!

శని ఆశీస్సులతో సంతోషంగా ఉండొచ్చు. శనివారం నాడు శని దేవుడుని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా శనికి ఇష్టమైన ఈ పూలను సమర్పించి ఆరాధిస్తే జీవితం లో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతాయి. శని దేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన శని బాధల నుండి బయటపడొచ్చు.

Published on: Dec 6, 2025, 10:00:09 IST
Advertisement

Shani Dev Favorite Flowers: శని దేవుని ప్రత్యేక అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. శని దేవుడికి కొన్ని పువ్వులు అంటే ఎంతో ఇష్టం. దేవుడికి పెట్టి సమర్పించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. శని ఆశీస్సులతో సంతోషంగా ఉండొచ్చు. శనివారం నాడు శని దేవుడుని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా శనికి ఇష్టమైన ఈ పూలను సమర్పించి ఆరాధిస్తే జీవితం లో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతాయి.

ఈ పువ్వులంటే శనికి ఎంతో ఇష్టం.. వీటిని సమర్పిస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది
ఈ పువ్వులంటే శనికి ఎంతో ఇష్టం.. వీటిని సమర్పిస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది

శని దేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన శని బాధల నుండి బయటపడొచ్చు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి వాటి నుండి కూడా సులువుగా ఉపశమనాన్ని పొందవచ్చు. మరి శనికి ఏ పూలను సమర్పిస్తే మంచి జరుగుతుంది? శని దేవుడికి ఇష్టమైన ఆ పూల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పువ్వులంటే శనికి ఎంతో ఇష్టం.. వీటిని సమర్పిస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది

1.అపరాజిత పువ్వులు

ఈ పువ్వులు అంటే శనికి ఎంతో ఇష్టం. శని దేవుడికి శనివారం నాడు ఉదయాన్నే ఈ పూలను సమర్పించండి. 5, 7 లేదా 11 అపరాజిత పువ్వులను శనికి పెట్టి పూజించడం వలన శని దేవుని సమస్యల నుంచి బయటపడొచ్చు. శని కష్టానికి తగ్గ ఫలితాలను కూడా అందిస్తాడు. శుభ ఫలితాలను చూడొచ్చు.

2.మందారం పువ్వులు

శనికి ఇష్టమైన మందారం పువ్వులను శనివారం నాడు సమర్పించండి. శనికి ఈ పువ్వులు అంటే ఇష్టం. అలాగే దుర్గాదేవికి కూడా మందారం పువ్వులు అంటే ఎంతో ఇష్టం. ఎర్ర మందారం పూలను శనికి సమర్పించడం వలన శని దోషాల నుంచి బయటపడొచ్చు. శని ప్రత్యేక అనుగ్రహం కూడా కలుగుతుంది.

3.జమ్మి పువ్వులు

శనికి నీలం రంగులో ఉండే జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం. వీటిని కూడా శని దేవుడికి శనివారం నాడు సమర్పించండి. దీంతో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. శని బాధలు కూడా తగ్గుతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్నవారు కూడా ఈ పూలను శనికి సమర్పిస్తే కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. కష్టాలు తగ్గుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks