శని ప్రదోష వ్రతం : ఈ రాశులపై ప్రభావం - అనుగ్రహం కోసం చేయాల్సిన 5 పరిహారాలివే

2026 జూన్ 27 శనివారం నాడు శని ప్రదోష వ్రతం రానుంది. ఏల్నాటి శని, ధైయా ప్రభావంతో బాధపడే మేషం, కుంభం, మీనం, సింహం, ధనుస్సు రాశుల వారు శని దేవుడి అనుగ్రహం కోసం చేయాల్సిన ప్రత్యేక పరిహారాలు.

Published on: Jun 26, 2026, 13:27:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన రోజుల్లో శని ప్రదోష వ్రతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడితో పాటు శని దేవుని అనుగ్రహాన్ని ఒకే రోజు పొందేందుకు ఈ పర్వదినం అత్యంత ప్రశస్తమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 27, శనివారం నాడు శని ప్రదోష వ్రతం రానుంది. జాతకంలో శని దోషాలు ఉన్నా, ప్రస్తుతం శని దేవుడి ప్రతికూల సంచారం వల్ల ఇబ్బందులు పడుతున్నా.. ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు అపారమైన ఉపశమనాన్ని ఇస్తాయి.

శని ప్రదోష వ్రతం
శని ప్రదోష వ్రతం

ప్రస్తుత గ్రహాల స్థితిని బట్టి చూస్తే కొన్ని రాశుల వారు శని ప్రభావం వల్ల ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మేష రాశి, కుంభ రాశి, మీన రాశి వారు ప్రస్తుతం ఏల్నాటి శని (సడే సతి) ప్రభావంతో ఉన్నారు. అదే సమయంలో సింహ రాశి, ధనుస్సు రాశి వారు శని ధైయా (అర్థాష్టమ లేదా అష్టమ శని) ప్రభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఐదు రాశుల వారు శని ప్రదోష వ్రతం రోజున ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వల్ల శని దేవుడి ఉగ్రరూపం శాంతించి, శుభ ఫలితాలు లభిస్తాయి.

1. శని ఆలయంలో ఆవనూనె దీపం

శని ప్రదోష వ్రతం రోజున సాయంత్రం వేళ శని దేవుడి ఆలయానికి వెళ్లాలి. అక్కడ నల్లని నువ్వులు వేసిన ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత శని దేవుడిని స్మరిస్తూ, "ఓం శ్యామ్ శనిశ్చరాయ నమః" అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు భక్తిశ్రద్ధలతో జపించాలి. ఇలా చేయడం వల్ల శని గ్రహ దోషాల తీవ్రత తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

2. శని అనుగ్రహం కోసం ఈ వస్తువుల దానం

ఈ పవిత్రమైన రోజున శని దేవునికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని అశుభ ఫలితాలు తొలగిపోతాయి. శని ప్రదోషం నాడు నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు, మినుములు (నల్ల మినపప్పు) మరియు ఇనుముతో చేసిన వస్తువులను పేదలకు లేదా అర్హులైన వారికి దానం చేయాలి. దీనివల్ల శని దేవుడు సంతోషించి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని నమ్ముతారు.

3. రావి చెట్టు వద్ద ప్రదక్షిణలు

సడే సతి, ధైయా ప్రభావం ఎక్కువగా ఉన్నవారు శని ప్రదోషం రోజున రావి చెట్టు (అశ్వత్థ వృక్షం) వద్దకు వెళ్లి, ఆవ నూనెతో దీపం పెట్టాలి. రావి చెట్టులో త్రిమూర్తులతో పాటు శని దేవుడు కూడా నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీపం పెట్టిన తర్వాత రావి చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేయడం వల్ల పట్టిందల్లా బంగారమయం అవుతుందని…. అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగుతాయని భక్తుల విశ్వాసం.

4. హనుమాన్ చాలీసా పఠనం

శని దేవుడి ఉగ్రత నుంచి సులభంగా తప్పించుకోవాలంటే హనుమంతుడిని ఆరాధించడం ఏకైక మార్గం. శని ప్రదోషం రోజున ఆంజనేయ స్వామికి సింధూరం మరియు మల్లె నూనె (చమేలీ తైలం) సమర్పించి పూజించాలి. శని దేవుడి ప్రతికూల ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజున కనీసం 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. హనుమద్ భక్తులను తాను ఎప్పటికీ ఇబ్బంది పెట్టనని శని దేవుడు స్వయంగా వరమిచ్చిన సంగతి తెలిసిందే.

5. శివలింగానికి జలాభిషేకం

శని దేవుడు పరమశివుడిని తన గురువుగా, ఆరాధ్య దైవంగా భావిస్తాడు. అందుకే శని ప్రదోష వ్రతం రోజున ఉదయాన్నే లేదా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివలింగానికి భక్తితో జలాభిషేకం చేయాలి. శివ పూజ చేసే వారిపై శని దేవుడు ఎల్లప్పుడూ కరుణాకటాక్షాలను కురిపిస్తాడు. శివనామ స్మరణతో శని దోషాలన్నీ పటాపంచలవుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More