...
...
Next Story

ఈ 2 రాశులపై శని కృప - డిసెంబర్ వరకు వీరికి లక్కీ డేస్..! ప్రతిఫలాలతో పాటు కొత్త అవకాశాలు, ఎలా ఉంటుందంటే..?

వేద జ్యోతిష్యం ప్రకారం 2026 ఏడాది పొడవునా శని దేవుడు మీన రాశిలో సంచరించనున్నాడు. దీనివల్ల వృషభం, మకర రాశుల వారికి డిసెంబర్ నాటికి అపారమైన ధనలాభం, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి లభించనుంది.

Published on: Jun 20, 2026, 10:24:51 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

వేద జ్యోతిషశాస్త్రంలో శని భగవానుడిని కర్మ ఫలదాతగా, న్యాయాధికారిగా పరిగణిస్తారు. మనుషులు చేసే మంచి, చెడు పనులను బట్టి శని దేవుడు ఫలితాలను ఇస్తాడు. ఈ క్రమంలోనే 2026 సంవత్సరంలో శని గ్రహం ఏడాది పొడవునా మీన రాశిలోనే కొనసాగనున్నాడు. శని యొక్క ఈ ప్రత్యేక స్థానం కొన్ని రాశిచక్రాల వారికి తీవ్రమైన కష్టాల నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, అద్భుతమైన కెరీర్ పురోగతిని తీసుకువస్తుందని జ్యోతిష్య నిపుణులు బలంగా నమ్ముతున్నారు.

శని కృపతో ఈ రెండు రాశుల వారికి తిరుగుండదు
శని కృపతో ఈ రెండు రాశుల వారికి తిరుగుండదు

ముఖ్యంగా వృషభ రాశి, మకర రాశి వారు ఈ ఏడాది చివరి నాటికి అత్యంత సానుకూల ఫలితాలను అందుకుంటారు. అంటే…. 2026 సంవత్సరంలో మిగిలి ఉన్న రాబోయే 193 రోజులు ఈ రెండు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారనున్నాయి. ఈ సమయంలో వృషభ, మకర రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరమైన విషయాలలో అపారమైన ప్రయోజనాలను పొందుతారని, వారు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు.

వృషభ రాశి వారికి అఖండ ధనలాభం..

వృషభ రాశి వారికి శని దేవుడు లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజులు గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో తాము చేసిన కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో పాటు పదోన్నతి (ప్రమోషన్) లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా ఊపందుకుంటాయి.

వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయం ఎంతో లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించాలనే మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు అందుతాయి. ఇంట్లో కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు.

మకర రాశి వారికి కొత్త అవకాశాలు….

వ్యాపారులకు ఈ కాలం గోల్డెన్ పీరియడ్ లాంటిది. వ్యాపారాన్ని విస్తరించాలనే మీ వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాల ద్వారా భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరగడమే కాకుండా, భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేసే అవకాశం కూడా దక్కుతుంది.

జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం శని దేవుడు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసే వారిని, క్రమశిక్షణతో జీవితాన్ని గడిపే వారిని మాత్రమే అనుగ్రహిస్తాడు. అందువల్ల…. ఈ కాలంలో బద్ధకాన్ని వీడి, పనులను వాయిదా వేసే అలవాటును పూర్తిగా మానుకోవాలి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆఫీసులో గానీ, బయట గానీ అనవసరమైన వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా రాబోయే రోజుల్లో శని దేవుని అనుగ్రహంతో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks