రేపు శని త్రయోదశి+మాస శివరాత్రి+కృత్తికా నక్షత్రం.. గ్రహ దోషాలు, డబ్బు, సంతానం కోసం పరిహారాలు!

జూన్ 13వ తేదీ ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ రోజు మాస శివరాత్రి, శని త్రయోదశి మరియు కృత్తికా నక్షత్రం కలయికతో ఏర్పడటం ఒక అరుదైన యోగం. శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారికి, జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారికి ఈ రోజున చేసే పరిహారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. 

Published on: Jun 12, 2026, 17:01:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన సమస్యలకు కారణం గ్రహాల కదలికలు కూడా అవ్వచ్చు. అయితే చాలామంది శని బాధలతో సతమతమవుతుంటారు. శని కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

రేపు శని త్రయోదశి+మాస శివరాత్రి+కృత్తికా నక్షత్రం.. గ్రహ దోషాలు, డబ్బు, సంతానం కోసం పరిహారాలు!
రేపు శని త్రయోదశి+మాస శివరాత్రి+కృత్తికా నక్షత్రం.. గ్రహ దోషాలు, డబ్బు, సంతానం కోసం పరిహారాలు!

రేపు, అనగా జూన్ 13న మాస శివరాత్రి, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం అని చెప్పొచ్చు. శని బాధల నుంచి బయటపడడానికి ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. రేపు మాస శివరాత్రి, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కనుక ఈ మహోత్తరమైన రోజున శివాభిషేకం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్షు పెరుగుతుంది, సంపద కూడా కలుగుతుంది.

ఏలినాటి శనితో సతమతమవుతున్న రాశులు:

కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్లయితే ఈ రోజున దశరథ ప్రోక్త, శని స్తోత్రం చదువుకోవడం మంచిది.

అర్ధాష్టమ శని, అష్టమ శని:

ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. సింహ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. అలాగే సింహరాశిలో సర్పగ్రహమైనటువంటి కేతువు, కుంభరాశిలో సర్పగ్రహమైన రాహువు ఉన్నారు. కాబట్టి రాహు, కేతు దోషాల నుంచి బయటపడడానికి శివాభిషేకం చేస్తే మంచిది.

ఇంట్లో శివాభిషేకం చేసుకోవచ్చా?

రాశుల వారు సమస్యల నుంచి బయటపడడానికి ఇంట్లో కూడా శివలింగం ఉన్నట్లయితే శివాభిషేకం చేసుకోవచ్చు. అలాగే సమస్యలు ఏమీ లేని వారు మహాశివుని అనుగ్రహం కోసం మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేసుకోవచ్చు. శివుడికి ఇష్టమైన మారేడు దళాలను సమర్పిస్తే మరీ మంచిది.

ఐశ్వర్యం కలగడానికి, గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఏం చేయాలి?

ఈ పవిత్రమైన దినాన ఐశ్వర్యం కలగాలంటే బిల్వాష్టకం చదువుకుంటే మంచిది. అలాగే గ్రహ దోషాల నుంచి బయట పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోండి. దీని వలన గ్రహదోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. బాధలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.

అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకుంటే వివాహం అవుతుంది:

వివాహం కాని వారు ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది.

సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం:

సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన కుజదోషం తొలగిపోతుంది. రేపు కృత్తికా నక్షత్రం ఉంది కనుక కుజదోషం పోవడానికి ఈ పరిహారాన్ని పాటించండి. అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ మంత్రాలను చదువుకుంటే కూడా మంచిది:

ఒకవేళ ఈ పరిహారాలను పాటించలేము అనుకునేవారు ఈ శ్లోకాలు, ఈ మంత్రాలను జపించడం మంచిది.

"శం శనైశ్చరాయ నమః"

"శివాయ గురవే నమః"

ఈ మంత్రాలను 108 సార్లు జపిస్తే అద్భుతంగా పని చేస్తుంది.

శివయ్య అనుగ్రహం కలగడానికి ఈ మంత్రం జపించండి:

ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో సమస్యలు తొలగిపోవాలంటే "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More