శారదీయ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. నవరాత్రుల సమయంలో అమ్మవారి తొమ్మిది రూపాలను తొమ్మిది రోజులు కూడా పూజించడం జరుగుతుంది. నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కొన్నింటిని సమర్పించడం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

అమ్మవారికి ఇష్టమైన పూలు గురించి రోజు తెలుసుకుందాం. అలాగే, అమ్మవారిని ఆరాధించేటప్పుడు తొమ్మిది రోజులు కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. వాటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రులు 2026:
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. శారదీయ నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు చాలా ముఖ్యమైనవి. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. పూలు, పండ్లు, నైవేద్యాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. అక్టోబర్ 11, ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 19 దాకా కొనసాగుతాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలి.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూలను నవరాత్రుల్లో కచ్చితంగా సమర్పించేలా చూసుకోండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు శారదీయ నవరాత్రులలో కచ్చితంగా ఈ పూలను సమర్పించేటట్టు చూసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర మందారాలు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
అలాగే, ఎరుపు రంగులో ఉండే పూలను కచ్చితంగా అమ్మవారికి సమర్పించేలా చూసుకోండి. ఎరుపు రంగు భక్తి, దైవిక శక్తికి ప్రత్యేకం. అలాగే, గులాబీ పూలు, మల్లెపూలు, మొగలిపూలు, పారిజాతం పూలు, సంపంగి పూలు, తామర పుష్పాలను సమర్పించండి. ఇవి కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి.
కొన్ని చోట్ల తొమ్మిది రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటారు. శైలపుత్రి దేవికి మల్లె, చంద్రఘంటకు తామర, కూష్మాండకు బంతిపూలు, కాత్యాయనీ దేవికి బంతి లేదా గులాబీ పూలను సమర్పిస్తారు. అలాగే, కాలరాత్రికి ఎర్ర మందారాలు, మహాగౌరీకి మల్లె లేదా మొగలిపూలను సమర్పిస్తారు.
పూలు సమర్పించేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించండి:
భక్తితో అమ్మవారికి పుష్పాలను సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి. పూలను సమర్పించేటప్పుడు తాజా పూలు, శుభ్రమైనవి సమర్పించాలి.
{{/usCountry}}భక్తితో అమ్మవారికి పుష్పాలను సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి. పూలను సమర్పించేటప్పుడు తాజా పూలు, శుభ్రమైనవి సమర్పించాలి.
{{/usCountry}}వాడిపోయిన పూలను అసలు సమర్పించకూడదు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. మంత్ర జపం చేయాలి. నైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించండి.
తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఎదుట దీపాలను వెలిగించండి.
ఇలా దీప, ధూప, నైవేద్యాలతో అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. ఏ పుష్పాన్ని సమర్పించినా భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యమైనవి. అలాగే, స్వచ్ఛమైన మనసుతో చేసే పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని గుర్తుంచుకోండి.