శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాము. అలాగే, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజులూ అలంకరించి, దీప, ధూప, నైవేద్యాలను సమర్పిస్తాము. అయితే, శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ మంత్రాలను జపించండి. ధైర్యం, జ్ఞానం, మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం భక్తులు ఈ మంత్రాలను జపిస్తారు.

శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనీ, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిని పూజిస్తాము. అయితే, ఇలా తొమ్మిది రోజులూ అమ్మవారిని పూజించేటప్పుడు ఈ మంత్రాలను కచ్చితంగా జపించేలా చూసుకోండి.
అమ్మవారి అనుగ్రహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కోసం ఏ మంత్రాలను జపించాలి?
ఈ మంత్రాలను జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
దుర్గాదేవి మంత్రం: ఓం దుం దుర్గాయై నమః
ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే మంచిది.
సరస్వతీ మంత్రం: ఓం ఐం సరస్వత్యై నమః
ఈ మంత్రాన్ని చదవడం వల్ల విద్య, జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
మహాలక్ష్మీ మంత్రం
ఈ నవరాత్రుల్లో ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలగడానికి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపించండి. కుటుంబ శ్రేయస్సు కూడా కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు.
మహాకాళి మంత్రం
ధైర్యం, అంతర్గత శక్తి, భయాలను తొలగించుకోవడానికి ఓం క్రీం కాళికాయై నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపిస్తే మనోబలం కూడా పెరుగుతుంది.
అమ్మవారి సర్వమంగళ మంత్రం
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే..
{{/usCountry}}ధైర్యం, అంతర్గత శక్తి, భయాలను తొలగించుకోవడానికి ఓం క్రీం కాళికాయై నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపిస్తే మనోబలం కూడా పెరుగుతుంది.
అమ్మవారి సర్వమంగళ మంత్రం
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే..
{{/usCountry}}ఈ మంత్రాన్ని కూడా నవరాత్రుల్లో జపించండి. ఈ మంత్రాన్ని జపిస్తే శుభం, శాంతి, కుటుంబ క్షేమం కలుగుతాయి.
నవరాత్రుల్లో మంత్రాలను ఎలా జపిస్తే మంచిది?
స్నానం చేసి ఉదయం లేదా సాయంత్రం పూజ సమయంలో జపిస్తే మంచిది. అమ్మవారికి దీపారాధన చేసి పుష్పాలను సమర్పించండి. ఈ మంత్రాలను 9, 11 లేదా కుదిరితే 108 సార్లు పఠిస్తే మంచిదే. కుటుంబం, ఆరోగ్యం, శాంతి కోసం అమ్మవారిని ప్రార్థించి మంత్రాలను పఠించండి. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. సమస్యల నుంచి బయటపడడానికి వీలవుతుంది.