శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ ఏ మంత్రాలు జపించాలి? విశేష ఫలితాలు ఇవే!
శారదీయ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచి, ఈ శక్తివంతమైన మంత్రాలను జపించడం ద్వారా అపారమైన ధైర్యం, జ్ఞానం, మనశ్శాంతి, సుఖసంతోషాలు సిద్ధిస్తాయి.
శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాము. అలాగే, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజులూ అలంకరించి, దీప, ధూప, నైవేద్యాలను సమర్పిస్తాము. అయితే, శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ మంత్రాలను జపించండి. ధైర్యం, జ్ఞానం, మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం భక్తులు ఈ మంత్రాలను జపిస్తారు.

శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనీ, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిని పూజిస్తాము. అయితే, ఇలా తొమ్మిది రోజులూ అమ్మవారిని పూజించేటప్పుడు ఈ మంత్రాలను కచ్చితంగా జపించేలా చూసుకోండి.
అమ్మవారి అనుగ్రహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కోసం ఏ మంత్రాలను జపించాలి?
ఈ మంత్రాలను జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
దుర్గాదేవి మంత్రం: ఓం దుం దుర్గాయై నమః
ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే మంచిది.
సరస్వతీ మంత్రం: ఓం ఐం సరస్వత్యై నమః
ఈ మంత్రాన్ని చదవడం వల్ల విద్య, జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
మహాలక్ష్మీ మంత్రం
ఈ నవరాత్రుల్లో ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలగడానికి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపించండి. కుటుంబ శ్రేయస్సు కూడా కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు.
మహాకాళి మంత్రం
ధైర్యం, అంతర్గత శక్తి, భయాలను తొలగించుకోవడానికి ఓం క్రీం కాళికాయై నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపిస్తే మనోబలం కూడా పెరుగుతుంది.
అమ్మవారి సర్వమంగళ మంత్రం
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే..
ఈ మంత్రాన్ని కూడా నవరాత్రుల్లో జపించండి. ఈ మంత్రాన్ని జపిస్తే శుభం, శాంతి, కుటుంబ క్షేమం కలుగుతాయి.
నవరాత్రుల్లో మంత్రాలను ఎలా జపిస్తే మంచిది?
స్నానం చేసి ఉదయం లేదా సాయంత్రం పూజ సమయంలో జపిస్తే మంచిది. అమ్మవారికి దీపారాధన చేసి పుష్పాలను సమర్పించండి. ఈ మంత్రాలను 9, 11 లేదా కుదిరితే 108 సార్లు పఠిస్తే మంచిదే. కుటుంబం, ఆరోగ్యం, శాంతి కోసం అమ్మవారిని ప్రార్థించి మంత్రాలను పఠించండి. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. సమస్యల నుంచి బయటపడడానికి వీలవుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


