శివరాత్రి నాడు పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే శివుని ప్రత్యేకించి ఆరాధించాలి. అలాగే కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. శివ పురాణంలో ధన లాభం కలగడానికి, సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ఉపాయాల గురించి తెలియజేయడం జరిగింది. శివుడికి సంబంధించి ఎన్నో పురాణాలు ఉన్నా, శివ పురాణం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన కోరికలు నెరవేరడానికి పరిహారాల గురించి ఇందులో చెప్పారు. ధన లాభం కలగాలంటే శివ పురాణం ప్రకారం వీటిని శివరాత్రి నాడు పాటించడం మంచిది.
శివరాత్రి 2026

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు శివుడిని ఆరాధించి, ఉపవాసం ఉండి జాగరణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా మంచి జరుగుతుంది.
అక్షింతలను సమర్పించండి:
శివుడికి అక్షింతలను సమర్పించండి. విరిగిపోయిన వాటిని సమర్పించకూడదు. శివ పూజలో అక్షింతలను ఉపయోగించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. బియ్యానికి శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుంది. శుక్రుడు డబ్బు, విలాసాలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. కనుక శివుడికి బియ్యం లేదా అక్షింతలను సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది. శుభ ఫలితాలను పొందవచ్చు. ధర్మగ్రంథాలలో బియ్యాన్ని "హవిష్య అన్నం" అని పిలుస్తారు, అంటే హోమానికి ఉపయోగించే ధాన్యమని. అందుకే బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
జలాభిషేకం చేయండి:
శివరాత్రి నాడు గంగాజలం, నల్ల నువ్వులను నీళ్లలో వేసి శివునికి అభిషేకం చేయండి. అలాగే ఆ తర్వాత "ఓం నమ: శ్శివాయ" అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. ఇలా చేయడం కూడా మంచిది.
వీటిని కూడా పాటించవచ్చు
శివపురాణం ప్రకారం చూసినట్లయితే గోధుమలు, బార్లీ ఎంతో పవిత్రమైనవి. నీళ్లలో బార్లీని కలిపి శివుడికి సమర్పిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. పూర్వికుల అనుగ్రహం కూడా కలుగుతుంది. గోధుమలను ఆ రోజు దానం చేస్తే శివయ్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.
లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి:
{{/usCountry}}శివపురాణం ప్రకారం చూసినట్లయితే గోధుమలు, బార్లీ ఎంతో పవిత్రమైనవి. నీళ్లలో బార్లీని కలిపి శివుడికి సమర్పిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. పూర్వికుల అనుగ్రహం కూడా కలుగుతుంది. గోధుమలను ఆ రోజు దానం చేస్తే శివయ్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.
లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి:
{{/usCountry}}శివరాత్రి రోజు శివలింగం దగ్గర దీపం వెలిగించండి. ఇది జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కుబేరుని అనుగ్రహం కూడా ఉంటుంది.
ఆర్థిక సమస్యలు ఇలా తొలగించుకోండి
శివరాత్రి నాడు అన్ని విధాలుగా కలిసి రావాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా ఈ విధంగా పాటించండి. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు ఇలా చేస్తే బాగా కలిసి వస్తుంది. సాయంత్రం సంధ్య వేళలో శివాలయానికి వెళ్లి, శివలింగం దగ్గర నెయ్యి దీపం పెట్టండి. ఇలా చేస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి. సోమవారం నాడు దీనిని మొదలుపెట్టి 41 సోమవారాల పాటు ఇలా దీపారాధన చేయండి. ఇక ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.