Shlokas for Kids: తప్పక పిల్లలకు నేర్పించాల్సిన 7 సంస్కృత శ్లోకాలు!

పిల్లలకు శ్లోకాలు నేర్పించడం వలన అనేక మార్పులను చూడొచ్చు. తప్పకుండా పిల్లలకు కుదిరితే ఈ శక్తివంతమైన సంస్కృత శ్లోకాలను నేర్పించండి. శ్లోకాలు నేర్చుకోవడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా మేము తెలిపాము. మరి ఆలస్యం ఎందుకు? శ్లోకాల వలన కలిగే ప్రయోజనాలు, పిల్లలు నేర్చుకోవాల్సిన శ్లోకాల గురించి తెలుసుకోండి

Published on: Apr 6, 2026, 14:01:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు శ్లోకాలను నేర్పుతారు. శ్లోకాలను పిల్లలు నేర్చుకోవడం వలన వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చదువులో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు శ్లోకాలు నేర్చుకుంటే మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. శ్లోకాలలో ఉన్న ధ్వనులు మెదడుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. పిల్లలు శ్లోకాలు నేర్చుకుంటే క్రమశిక్షణ, గౌరవం, ధర్మం వంటి విలువలను నేర్చుకోవచ్చు. శ్లోకాలు చెప్పే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Shlokas for Kids: తప్పక పిల్లలకు నేర్పించాల్సిన 7 సంస్కృత శ్లోకాలు (pinterest)
Shlokas for Kids: తప్పక పిల్లలకు నేర్పించాల్సిన 7 సంస్కృత శ్లోకాలు (pinterest)

సంస్కృత శ్లోకాలు పిల్లలు జపిస్తే మాటల స్పష్టత, ఉచ్చారణ నైపుణ్యం కూడా పెరుగుతాయి. మంత్రాల ధ్వనులు పిల్లల్లో ధైర్యాన్ని అందిస్తాయి, భయాన్ని తగ్గిస్తాయి. పిల్లలు శ్లోకాలను నేర్చుకోవడం వలన పాజిటివ్ శక్తి కలుగుతుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా, చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ శ్లోకాలను నేర్పితే దేవుడిపై విశ్వాసం, భక్తి పెరుగుతాయి. జీవితంలో మంచి దారిని ఇవి చూపిస్తాయి.

తప్పక పిల్లలకు నేర్పించాల్సిన శక్తివంతమైన సంస్కృత శ్లోకాలు

1.గురు మంత్రం:

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః

గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః

ఈ శ్లోకాన్ని పిల్లలు చదవడం వలన చాలా విషయాలు తెలుస్తాయి. గురువు పట్ల గౌరవాన్ని ఇది నేర్పుతుంది. గురువులను దేవతలతో సమానంగా చూడాలి అనే భావన పిల్లల్లో పెరుగుతుంది.

2.మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మంత్రం శివుడికి అంకితం చేయబడింది. దీనిని జపిస్తే ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలుగుతాయి. భయాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

3.మహాలక్ష్మి మంత్రం:

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే

ఈ మంత్రాన్ని లక్ష్మీదేవికి అంకితం చేశారు. ఈ మంత్రాన్ని పిల్లలు చదివితే సంపద, విజయాలను పొందవచ్చు.

4.వినాయక మంత్రం:

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

వినాయకునికి అంకితమైన ఈ మంత్రాన్ని పిల్లలు రోజూ చదవడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు, ఆనందాన్ని అందిస్తాడు. చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది.

5.రుద్ర మంత్రం:

ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని పిల్లలు రోజూ చదువుకుంటే ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఈ మంత్రం కూడా శివుడికి అంకితం చేయబడింది.

6.సరస్వతి మంత్రం:

యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్తితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

సరస్వతి దేవి జ్ఞానం, విద్యకు దేవత. రోజూ సరస్వతి మంత్రాన్ని పిల్లలు చదువుకుంటే చదువుపై ఆసక్తి పెరుగుతుంది. సరస్వతి దేవి అనుగ్రహంతో చదువులో బాగా రాణిస్తారు.

7.గాయత్రి మంత్రం:

ఓం భూర్భువః స్వః, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్

ఈ మంత్రాన్ని పిల్లలు రోజూ చదువుకుంటే జ్ఞానాన్ని పొందాలనే తపన వారిలో పెరుగుతుంది. అంతే కాదు దీనిని జపిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More