జ్యోతిష్య శాస్త్రంలో సంపద, వైభవం, శృంగారం, భోగభాగ్యాలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం త్వరలోనే తన నక్షత్ర సంచారాన్ని మార్చబోతోంది. ప్రస్తుతం తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో ప్రయాణిస్తున్న శుక్రుడు…. త్వరలోనే చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య నిబంధనల ప్రకారం చిత్ర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). అంటే శుక్రుడు కుజ నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట.

హిందూ పంచాంగం ప్రకారం….. 2026 అక్టోబర్ 24న శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో డిసెంబర్ 5 వరకు శుక్రుడి సంచారం కొనసాగుతుంది. కుజ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల జాతకులకు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఈ కాలంలో నాలుగు ప్రధాన రాశుల వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతోందని, ఆకస్మిక ధనలాభంతో పాటు ఆర్థికంగా సమాజంలో హోదా పెరుగుతుందని ఆయన వివరించారు. అంగారక నక్షత్రంలో శుక్ర సంచారం వల్ల లబ్ధి పొందే ప్రధాన రాశులు ఇవే….
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది. ఆర్థిక మరియు వృత్తిపరమైన రంగాల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారి మధ్య బంధం మరింత బలపడి శృంగారం, ఆప్యాయతలు పెరుగుతాయి.
తులారాశి
తులారాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. సొంత రాశిలోనే శుక్రుడి ప్రభావం ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. కళలు, సాహిత్యం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఆసక్తి, నైపుణ్యాలు పెరిగి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులకు శుక్ర సంచారం నిజంగానే వెండి వెన్నెల కాచనుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వెతుక్కుంటూ వస్తాయి. పూర్వీకుల ఆస్తుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా భారీగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొనడంతో పాటు భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగి ప్రేమ బంధం మరింత మధురంగా మారుతుంది.
{{/usCountry}}కుంభ రాశి జాతకులకు శుక్ర సంచారం నిజంగానే వెండి వెన్నెల కాచనుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వెతుక్కుంటూ వస్తాయి. పూర్వీకుల ఆస్తుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా భారీగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొనడంతో పాటు భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగి ప్రేమ బంధం మరింత మధురంగా మారుతుంది.
{{/usCountry}}