జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సంపద, వైభవం, లగ్జరీ జీవితానికి కారకుడైన శుక్రుడి రాశి మార్పు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు సూర్యుడికి అధిపతి అయిన సింహరాశిలో సంచరిస్తున్నాడు.

హిందూ క్యాలెండర్ ప్రకారం….. ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు ఇదే రాశిలో కొనసాగుతాడు. దీనికి తోడు సింహ రాశిలో కేతువుతో శుక్రుడి కలయిక కూడా జరగనుంది. ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే రోజుల్లో కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు, శుభవార్తలు అందుతాయని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
"సింహరాశిలో శుక్రుడి గోచారం కారణంగా రాబోయే 18 రోజుల్లో కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం కలిగే అవకాశం ఉంది," అని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వృషభం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులతో పాటు సింహ రాశి జాతకులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారనుంది.
వృషభ రాశి :
వృషభ రాశి జాతకులకు ఈ కాలం అన్ని విధాలా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. గతంలో ఆస్తులపై పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది.
తులారాశి :
తులారాశి వారికి ఈ గోచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, హోదా పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారవేత్తలు భారీ లాభాలను ఆర్జించడానికి ఇది సువర్ణావకాశం.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి లాభాల బాట పడతారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు సఫలమవుతాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మీన రాశి :
మీన రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూల తీర్పులు వస్తాయి. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుని సకాలంలో పూర్తవుతాయి.
కన్యా రాశి :
{{/usCountry}}మీన రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూల తీర్పులు వస్తాయి. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుని సకాలంలో పూర్తవుతాయి.
కన్యా రాశి :
{{/usCountry}}కన్యా రాశి జాతకులకు పట్టిన ఆర్థిక కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం మెరుగుపడి, ఆమె వైపు నుంచి శుభవార్తలు వింటారు.