జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యానికి కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో విపరీతమైన కీర్తి ప్రతిష్టలు, అపారమైన ధనలాభం కలుగుతాయి. కేవలం రాశి మార్పు మాత్రమే కాకుండా…. శుక్రుడి నక్షత్ర సంచారం కూడా ద్వాదశ రాశుల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

ప్రస్తుతం శుక్ర గ్రహం రాహువుకి చెందిన స్వాతి నక్షత్రంలో ప్రయాణిస్తోంది. వైదిక పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించిన శుక్రుడు, అక్టోబర్ 23 అర్ధరాత్రి వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతారు. ఈ కాలంలో శుక్రుడి శుభ దృష్టి వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం తలపు తడుతోంది. ఇవాళ్టి నుంచి రాబోయే 30 రోజుల పాటు ఈ రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఆ అదృష్ట రాశుల వివరాలు, వాటికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం.
కర్కాటక రాశి
తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడి ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా మారింది. వీరి ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి శుభవార్త ఈ సమయంలో మీ ఇంటి తలుపు తడుతుంది.
తులారాశి
సంపదలను ప్రసాదించే శుక్రుడు సొంత రాశి అయిన తులారాశిలోనే సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి రాజయోగాన్ని తలపించే ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా భారీ బోనస్ లేదా జీతం పెంపు పొందే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు, ఆనందం వెల్లివిరుస్తాయి.
వృషభ రాశి
{{/usCountry}}సంపదలను ప్రసాదించే శుక్రుడు సొంత రాశి అయిన తులారాశిలోనే సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి రాజయోగాన్ని తలపించే ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా భారీ బోనస్ లేదా జీతం పెంపు పొందే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు, ఆనందం వెల్లివిరుస్తాయి.
వృషభ రాశి
{{/usCountry}}వృషభ రాశి అధిపతి కూడా శుక్రుడే కావడంతో, ఈ నక్షత్ర గోచారం వృషభ రాశి వారికి అత్యంత సానుకూల మార్పులను తీసికొని వస్తుంది. ప్రత్యేకించి వ్యాపార రంగానికి చెందిన వారికి ఇది ఒక సువర్ణ సమయం. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన కాలం. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయని భావించవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాహు నక్షత్రంలో శుక్రుడి సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి రెండింటిలోనూ ఊహించని మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసివస్తాయి, లాభాల బాట పడతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. అన్ని రకాలుగా ఈ కాలం మీకు సంపూర్ణ యోగాన్ని ఇస్తుంది.