హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా వచ్చే శుక్ల, కృష్ణ పక్షాల త్రయోదశి తిథిన ఈ వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా శుక్రవారం నాడు వచ్చే త్రయోదశిని 'శుక్ర ప్రదోష వ్రతం' అంటారు. ఈ పవిత్ర దినాన లయకారకుడైన పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.

సూర్యాస్తమయ వేళ, అనగా సంధ్యా సమయంలో (ప్రదోష కాలం) శివుడుని పూజించడం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యం. శివాలయాలను దర్శించి, అభిషేకాలు చేయడం, ప్రదోష వ్రత కథను పఠించడం ద్వారా సంపూర్ణ ఫలితం దక్కుతుంది.
శుక్ర ప్రదోష వ్రత పౌరాణిక కథ
పురాణాల ప్రకారం, పూర్వం ఒక నగరంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్లు. ఒకరు రాజకుమారుడు, మరొకరు బ్రాహ్మణ కుమారుడు, మూడోవాడు ధనికుడి (శ్రేష్ఠి) కుమారుడు. వీరిలో రాజకుమారుడు, బ్రాహ్మణ కుమారునికి వివాహాలు జరిగాయిగానీ, భార్యలను అత్తగారింటి నుంచి ఇంటికి తీసుకువచ్చే కార్యక్రమం జరగాల్సి ఉంది.
ఒకరోజు ముగ్గురు మిత్రులు సంభాషించుకుంటుండగా, బ్రాహ్మణ పుత్రుడు నారీల ప్రాముఖ్యాన్ని వివరిస్తాడు. ఈ మాటలకు ప్రభావితుడైన ధనిక కుమారుడు వెంటనే తన భార్యను ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా, "శుక్రాస్త సమయంలో వెళ్ళరాదు," అని తల్లిదండ్రులు హెచ్చరించారు. "ఈ సమయంలో పంపడం శుభం కాదు అని అన్నారు.
అయితే ధనిక పుత్రుడు ఎవరి మాట వినకుండా అత్తగారింటికి బయలుదేరుతాడు. అత్తగారింట కూడా అందరూ వారిని ఆపే ప్రయత్నం చేసినా పట్టు వీడడు. చివరికి కుటుంబ సభ్యులు విధిలేక ఆమెను పంపుతారు.
మార్గమధ్యంలో ఎదురైన విపత్తులు
నగరం దాటిన వెంటనే వారి బండి చక్రం ఊడిపోతుంది, ఎద్దు కాలు విరిగిపోతుంది. ఇద్దరికీ తీవ్ర గాయాలైనా ప్రయాణం కొనసాగిస్తారు. కొంతదూరం వెళ్లగానే దొంగలు వారికున్న ధనధాన్యాలన్నీ దోచుకుపోతారు. చివరకు భార్యాభర్తలు రోధిస్తూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే ఆ ధనిక పుమారుడిని విషసర్పం కాటేస్తుంది. వైద్యుడు పరిశీలించి అతడు మూడు రోజుల్లో మరణిస్తాడని ప్రకటిస్తాడు.
{{/usCountry}}నగరం దాటిన వెంటనే వారి బండి చక్రం ఊడిపోతుంది, ఎద్దు కాలు విరిగిపోతుంది. ఇద్దరికీ తీవ్ర గాయాలైనా ప్రయాణం కొనసాగిస్తారు. కొంతదూరం వెళ్లగానే దొంగలు వారికున్న ధనధాన్యాలన్నీ దోచుకుపోతారు. చివరకు భార్యాభర్తలు రోధిస్తూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే ఆ ధనిక పుమారుడిని విషసర్పం కాటేస్తుంది. వైద్యుడు పరిశీలించి అతడు మూడు రోజుల్లో మరణిస్తాడని ప్రకటిస్తాడు.
{{/usCountry}}ఈ దుర్వార్త తెలుసుకున్న బ్రాహ్మణ కుమారుడు వెంటనే వచ్చి, "మీ కొడుకు శుక్రాస్త సమయంలో భార్యను తీసుకు రావడం వల్లే ఈ ఆపదలు వచ్చాయి. వెంటనే అతడిని భార్యతో సహా అత్తగారింటికి తిరిగి పంపండి," అని సలహా ఇస్తాడు.
ధనిక కుమారుడి కుటుంబం ఆ సలహాను పాటిస్తూ కొడుకును, కోడలిని తిరిగి పంపిస్తుంది. అత్తగారింటికి చేరగానే ధనిక పుమారుడి ఆరోగ్యం కుదుటపడుతుంది. శుక్ర ప్రదోష వ్రత మహిమ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయి. ఆ దంపతులు శేష జీవితాన్ని ఆనందంగా గడిపి, అంత్యమున శివలోకం చేరుకుంటారు.
వ్రత ఆచరణ - ప్రయోజనాలు
శుక్ర ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో కలుగుతున్న ప్రతికూలతలు నశించి, అనుకున్న రంగంలో విజయం సాధిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.