శుక్ర ప్రదోష కథ: వ్రత మహిమ ఇదే.. దాంపత్య సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయట!

హిందూ సంప్రదాయంలో శుక్ర ప్రదోష వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. శుక్రవారం వచ్చే త్రయోదశి తిథిన పరమశివుడిని ప్రదోష కాలంలో పూజించడం వల్ల పాపాలు తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం 

Published on: Oct 23, 2026, 09:30:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా వచ్చే శుక్ల, కృష్ణ పక్షాల త్రయోదశి తిథిన ఈ వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా శుక్రవారం నాడు వచ్చే త్రయోదశిని 'శుక్ర ప్రదోష వ్రతం' అంటారు. ఈ పవిత్ర దినాన లయకారకుడైన పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.

శుక్ర ప్రదోష కథ: వ్రత మహిమ ఇదే.. దాంపత్య సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయట! (AI)
శుక్ర ప్రదోష కథ: వ్రత మహిమ ఇదే.. దాంపత్య సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయట! (AI)

సూర్యాస్తమయ వేళ, అనగా సంధ్యా సమయంలో (ప్రదోష కాలం) శివుడుని పూజించడం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యం. శివాలయాలను దర్శించి, అభిషేకాలు చేయడం, ప్రదోష వ్రత కథను పఠించడం ద్వారా సంపూర్ణ ఫలితం దక్కుతుంది.

శుక్ర ప్రదోష వ్రత పౌరాణిక కథ

పురాణాల ప్రకారం, పూర్వం ఒక నగరంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్లు. ఒకరు రాజకుమారుడు, మరొకరు బ్రాహ్మణ కుమారుడు, మూడోవాడు ధనికుడి (శ్రేష్ఠి) కుమారుడు. వీరిలో రాజకుమారుడు, బ్రాహ్మణ కుమారునికి వివాహాలు జరిగాయిగానీ, భార్యలను అత్తగారింటి నుంచి ఇంటికి తీసుకువచ్చే కార్యక్రమం జరగాల్సి ఉంది.

ఒకరోజు ముగ్గురు మిత్రులు సంభాషించుకుంటుండగా, బ్రాహ్మణ పుత్రుడు నారీల ప్రాముఖ్యాన్ని వివరిస్తాడు. ఈ మాటలకు ప్రభావితుడైన ధనిక కుమారుడు వెంటనే తన భార్యను ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా, "శుక్రాస్త సమయంలో వెళ్ళరాదు," అని తల్లిదండ్రులు హెచ్చరించారు. "ఈ సమయంలో పంపడం శుభం కాదు అని అన్నారు.

అయితే ధనిక పుత్రుడు ఎవరి మాట వినకుండా అత్తగారింటికి బయలుదేరుతాడు. అత్తగారింట కూడా అందరూ వారిని ఆపే ప్రయత్నం చేసినా పట్టు వీడడు. చివరికి కుటుంబ సభ్యులు విధిలేక ఆమెను పంపుతారు.

మార్గమధ్యంలో ఎదురైన విపత్తులు

నగరం దాటిన వెంటనే వారి బండి చక్రం ఊడిపోతుంది, ఎద్దు కాలు విరిగిపోతుంది. ఇద్దరికీ తీవ్ర గాయాలైనా ప్రయాణం కొనసాగిస్తారు. కొంతదూరం వెళ్లగానే దొంగలు వారికున్న ధనధాన్యాలన్నీ దోచుకుపోతారు. చివరకు భార్యాభర్తలు రోధిస్తూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే ఆ ధనిక పుమారుడిని విషసర్పం కాటేస్తుంది. వైద్యుడు పరిశీలించి అతడు మూడు రోజుల్లో మరణిస్తాడని ప్రకటిస్తాడు.

ఈ దుర్వార్త తెలుసుకున్న బ్రాహ్మణ కుమారుడు వెంటనే వచ్చి, "మీ కొడుకు శుక్రాస్త సమయంలో భార్యను తీసుకు రావడం వల్లే ఈ ఆపదలు వచ్చాయి. వెంటనే అతడిని భార్యతో సహా అత్తగారింటికి తిరిగి పంపండి," అని సలహా ఇస్తాడు.

ధనిక కుమారుడి కుటుంబం ఆ సలహాను పాటిస్తూ కొడుకును, కోడలిని తిరిగి పంపిస్తుంది. అత్తగారింటికి చేరగానే ధనిక పుమారుడి ఆరోగ్యం కుదుటపడుతుంది. శుక్ర ప్రదోష వ్రత మహిమ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయి. ఆ దంపతులు శేష జీవితాన్ని ఆనందంగా గడిపి, అంత్యమున శివలోకం చేరుకుంటారు.

వ్రత ఆచరణ - ప్రయోజనాలు

శుక్ర ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో కలుగుతున్న ప్రతికూలతలు నశించి, అనుకున్న రంగంలో విజయం సాధిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More