...
...
Next Story

శుక్రుడి అనుగ్రహంతో ఈ 3 రాశులకు 64 రోజుల పాటు ధనలాభం.. కెరీర్‌లో దూసుకుపోతారు!

శుక్రుడి తులా రాశి సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. శుక్రుడు సుమారు 64 నుంచి 66 రోజుల పాటు తులా రాశిలో సంచరిస్తున్న సమయంలో కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Published on: Sep 4, 2026, 16:00:43 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంతో శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్రుడి అనుగ్రహంతో ఈ 3 రాశులకు 64 రోజుల పాటు ధనలాభం.. కెరీర్‌లో దూసుకుపోతారు! (AI)
శుక్రుడి అనుగ్రహంతో ఈ 3 రాశులకు 64 రోజుల పాటు ధనలాభం.. కెరీర్‌లో దూసుకుపోతారు! (AI)

శుక్రుడు భౌతిక సుఖాలు, విలాసాలు, ఆకర్షణ, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. మానవుని జీవితంలో సంతోషాలు, సృజనాత్మకత, వ్యక్తిగత ఆకర్షణలను పెంచడానికి శుక్రుడి పాత్ర చాలా కీలకమైనది. జ్యోతిషం ప్రకారం సూర్యుడు సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. శుక్రుడు తులా రాశి సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు తీసుకురాబోతుంది. మరి అదృష్ట రాశులు ఎవరో చూద్దాం.

జ్యోతిషం ప్రకారం వృషభ, తులా రాశుల్లో శుక్ర సంచారం చాలా మంచిది. శుక్రుడు దాదాపు 64 నుంచి 66 రోజుల పాటు తులా రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారి కెరీర్ అద్భుతంగా దూసుకుపోతుంది. వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్ర సంచారంతో బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారికి ఇది గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం. పెట్టుబడి ద్వారా భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కూడా ఇదే శుభ సమయం. ఉద్యోగం ద్వారా శుభవార్తలు వింటారు. ఆఫీసులో కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టం కూడా మీకు తోడుగా ఉంటుంది. మీ పనులు అన్నిటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కూడా మంచి సమయం. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కళారంగానికి చెందిన నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్భుతమైన వేదికలు ఈ రాశి వారికి లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.

ధనుస్సు రాశి

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe