శుక్రాదిత్య రాజయోగం - అక్టోబర్ 17 నుంచి ఈ 4 రాశులవారికి రాజభోగాలు, లక్కీటైమ్ స్టార్ట్..!

అక్టోబర్ 17న తులారాశిలో సూర్య-శుక్రుల అరుదైన కలయికతో 'శుక్రాదిత్య రాజయోగం' ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన యోగం కారణంగా మేషం, కర్కాటకం సహా నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్‌లో అద్భుతమైన ఎదుగుదల లభించనున్నాయి.

Published on: Oct 5, 2026, 12:26:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నెలా జరిగే గ్రహాల సంచారానికి, గ్రహాల కలయికకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గ్రహాల స్థాన చలనం వల్ల కొన్నిసార్లు అత్యంత శుభప్రదమైన రాజయోగాలు రూపుదిద్దుకుంటాయి. ఈ క్రమంలోనే 2026 అక్టోబర్ నెలలో గ్రహాల వేగం, రాశి పరివర్తనం కారణంగా మహాద్భుత యోగం సిద్ధించబోతోంది. అక్టోబర్ 17వ తేదీన సూర్య భగవానుడు కన్యా రాశిని వీడి తులారాశిలోకి ప్రవేశించనున్నారు. అదే సమయానికి రాక్షస గురువైన శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశిలోనే సంచరిస్తున్నారు.

శుక్రాదిత్య రాజయోగం
శుక్రాదిత్య రాజయోగం

తులారాశిలో రవి, శుక్రుల కలయిక ఫలితంగా అత్యంత శక్తివంతమైన 'షుక్రాదిత్య రాజయోగం' ఏర్పడనుంది. వేద జ్యోతిషంలో శుక్రుడిని సంపద, వైభవం, భోగభాగ్యాలు, విలాసాలు, కళలకు కారకుడిగా భావిస్తారు. అలాగే సూర్యభగవానుడిని ఆత్మకారకుడిగా, పితృకారకుడిగా, కీర్తి ప్రతిష్టలు మరియు అధికారానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రెండు శుభ గ్రహాలు ఒకే రాశిలో జతకట్టినప్పుడు వ్యక్తి సాధికారత, సామాజిక ఆకర్షణ, కళాత్మక నైపుణ్యాలు మరియు సమాజంలో హోదా విపరీతంగా పెరుగుతాయి. రాబోయే ఈ రాజయోగం ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చివేసి, ఆర్థిక స్థితిని ఉన్నత శిఖరాలకు చేర్చనుంది. ఆ రాశుల సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

1. మేష రాశి:

ఈ రాశి వారికి ఈ శుక్ర-సూర్య సంయోగం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో తమ ప్రతిభతో కొత్త గుర్తింపును సాధిస్తారు. యాజమాన్యం నుంచి కీలకమైన బాధ్యతలు దక్కుతాయి. నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. నిలిచిపోయిన పాత బాకీలు చేతికి అందడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వామ్య వ్యాపారాల ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో బహుళ ప్రాచుర్యం పొందిన ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

2. కర్కాటక రాశి:

కర్కాటక రాశి జాతకులకు షుక్రాదిత్య రాజయోగం జీవితంలో పెద్ద సానుకూల మార్పులను తీసుకువస్తుంది. దీర్ఘకాలంగా నెరవేరని మీ మనసులోని కోరికలు ఈ సమయంలో ఈడేరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, అనురాగాలు పెరుగుతాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో మీ పనితీరును చూసి సహోద్యోగులు, ఉన్నతాధికారులు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. డబ్బుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. అదృష్టం మీ వెంటే ఉండటంతో కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.

3. కన్యా రాశి:

కన్యా రాశి వారికి ఈ రాజయోగం ఆర్థికంగా, వ్యాపారపరంగా అత్యంత ప్రయోజనకరంగా మారనుంది. మీ ఆదాయ మార్గాలు పెరిగి ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి దక్కుతుంది. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు (డీల్స్) కుదుర్చుకుంటారు, ఇవి సమీప భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పిడి లేదా పదోన్నతి (ప్రమోషన్) లభించే బలమైన సూచనలు ఉన్నాయి. మీ పనితనంతో శత్రువులపై పైచేయి సాధిస్తారు.

4. తులా రాశి:

స్వక్షేత్రమైన తులారాశిలోనే ఈ కలయిక జరుగుతుండటంతో తులా రాశి వారికి ఈ సమయం బంగారు కాలమనే చెప్పాలి. కెరీర్‌లో ఊహించని శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగార్థులకు నూతన ఉద్యోగం లేదా పెద్ద ప్రాజెక్ట్‌ను నడిపించే బాధ్యత లభిస్తుంది. సమాజంలో మీ హోదా, గౌరవ ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. మీలోని ధైర్యసాహసాలు…. నాయకత్వ లక్షణాలు ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తాయి. మందగించిన పాత పనులు వేగం పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా దృఢంగా మారుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More