...
...
Next Story

Monday Remedies: సోమవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం మీ వెంటే.. డబ్బు, ప్రశాంతత కోసం ఇవి పాటించండి!

సోమవారం పరమేశ్వరుడితో పాటు చంద్రుడికి కూడా ప్రత్యేకమైన రోజుగా జ్యోతిష్యంలో భావిస్తారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు కారకుడిగా పరిగణించబడుతున్న నేపథ్యంలో సోమవారం కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం ద్వారా ప్రశాంతత, సానుకూలత, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని నమ్మకం.

Published on: Sep 7, 2026, 12:30:43 IST
Advertisement

చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈరోజు చాలా మంది ఎదుర్కొనే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాలను ట్రై చేసి చూడండి. బాగా పనిచేస్తాయి. సోమవారం పరమేశ్వరుడికి మాత్రమే కాదు, చంద్రుడికి కూడా ప్రత్యేకమైన రోజు. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, చంద్రుడిని మన భావోద్వేగాలకు కారకుడిగా భావిస్తారు. సోమవారం చేసే పనులు మీ మనసు, భావోద్వేగాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వారం ప్రారంభాన్ని శుభప్రదంగా మార్చడానికి కొన్ని జ్యోతిష్య పరిహారాలను చూద్దాం.

సోమవారం శివలింగానికి పాలు సమర్పించండి

Monday Remedies: సోమవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం మీ వెంటే.. డబ్బు, ప్రశాంతత కోసం ఇవి పాటించండి! (AI)
Monday Remedies: సోమవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం మీ వెంటే.. డబ్బు, ప్రశాంతత కోసం ఇవి పాటించండి! (AI)

సోమవారం నాడు శివలింగానికి పచ్చి పాలను సమర్పించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. పాలలో కొంచెం మిరియాల పొడి కలిపి శివలింగానికి సమర్పిస్తే, చంద్రుడితో పాటు రాహువు, కేతువు దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతికూల ప్రభావాలు తగ్గి, సానుకూల మార్పులను చూడొచ్చు.

కుడి చేతితో నీళ్లు తాగండి

సోమవారం ఉదయం లేచాక కుడి చేతితో నీళ్లు తీసుకుని తాగడం చాలా మంచిది. ఇలా చేస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. క్లియర్‌గా ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

తల్లికి సోమవారం ఈ ప్రత్యేక కానుకను ఇవ్వండి

జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు తల్లికి ప్రత్యేకంగా భావిస్తారు. సోమవారం తల్లి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు తీసుకోండి. లేదంటే ఆమెకు ఒక తెల్లటి స్వీట్ ఇవ్వండి. ఒకవేళ మీ అమ్మగారు లేనట్లయితే, ఆవుకి పచ్చగడ్డిని తినిపించండి. దీని వలన విశేషమైన ఫలితాలను చూడొచ్చు. శుభప్రదమైన మార్పులు ఉంటాయి.

తెలుపు రంగు ప్రభావం

సోమవారం తెల్లటి దుస్తులను ధరించండి. ఇంట్లో తెల్లటి పూలను ఉంచండి. ఇవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చంద్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోయి, సంపదను పెంపొందించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే చాలా హాయిగా, ప్రశాంతంగా జీవించచ్చు.

ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లో సోమవారం చేయొద్దు

సాయంత్రం చంద్రుని దర్శించుకుని, తర్వాత ఒక గ్లాసు నీటిని వెన్నెల్లో పెట్టండి. తర్వాత రోజు ఉదయం ఆ నీటిని మొక్కకు పోయండి. ఇలా చేయడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు.

సోమవారం ఉపవాసం

సోమవారం ఉపవాసం ఉంటే మంచిది. సోమవారం ఉపవాసం చేసి సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని చూడొచ్చు. శివయ్య, హనుమాన్ అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. మానసిక ఆందోళన నుంచి బయటపడడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe