మనకి ఎలా అయితే రాశి ఫలాలు ఉంటాయో, చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో జంతువులు ఉంటాయి. ప్రాచీన గ్రంథాలు, చైనీస్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అసాధారణమైన మేధస్సుతో ప్రత్యేకంగా నిలిచే రాశుల గురించి ఈరోజు చూద్దాం. వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ జంతువులకు సంబంధించిన వారు పదునైన బుద్ధి, చురుకైన ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. అంతేకాదు, వినూత్నమైన ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. మరి వారు ఎవరు? ఎవరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి? పుట్టుకతోనే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉన్నవారు ఎవరు? అనే దాని గురించి ఇప్పుడే చూసేద్దాం.
ఈ చైనీస్ రాశులకు చాణక్యుడిని మించిన తెలివితేటలు
1.ఎలుక
పుట్టిన సంవత్సరాలు: 1924, 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020.
ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఎలుకకు చెందినవారు. ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. పదునైన జ్ఞాపకశక్తి వీరికి ఉంటుంది. వీరు తెలివితేటలతో ప్రత్యేకంగా నిలుస్తారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం, పరిస్థితులను వీరు సులభంగా అర్థం చేసుకోగలరు.
క్లిష్టమైన పరిస్థితులను కూడా జాగ్రత్తగా పరిష్కరిస్తారు. తక్కువ శ్రమతో అవకాశాలను విజయాలుగా మార్చుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది. ఎలుక నీటి తత్వానికి చెందిన రాశి కనుక, మానసిక చురుకుదనం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం, విద్య వంటి రంగాల్లో మంచి నాయకులుగా ఎదుగుతారు.
2.డ్రాగన్
పుట్టిన సంవత్సరాలు: 1928, 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012, 2024.
{{/usCountry}}పుట్టిన సంవత్సరాలు: 1928, 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012, 2024.
{{/usCountry}}ఈ సంవత్సరాల్లో పుట్టినట్లయితే వారి రాశి డ్రాగన్ అవుతుంది. మీరు కూడా ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు దూరదృష్టి కలిగిన వారు. వీరి దృష్టి ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక లక్ష్యాలపైనే ఉంటుంది. అంతేకాదు, ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
తెలివితేటలు, అద్భుతమైన జ్ఞాపకశక్తి వీరిలో ఉంటుంది. సహజ తత్వవేత్తలు, మార్గదర్శకులు కూడా. గొప్ప ఆలోచనలను సృష్టిస్తారు. వాటిని శక్తివంతంగా అమలు చేసే సామర్థ్యం వీరిలో ఉంటుంది. అగ్ని, భూమి తత్వాల కలయిక వీరిలో ఉండడంతో ఇతరులను కూడా ప్రేరేపించగలరు.
3.కోతి
పుట్టిన సంవత్సరాలు: 1932, 1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016, 2028.
ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు కోతికి చెందినవారు. ఈ రాశి వారు సరదా స్వభావంతో పాటు లోతైన తెలివితేటలతో ఉంటారు. హాస్యాన్ని, మేధస్సును బ్యాలెన్స్ చేస్తారు. కొత్త విషయాలను కూడా ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు వేగంగా నేర్చుకోగలరు.
ఏ నైపుణ్యానికైనా సరే త్వరగా అలవాటు పడిపోతారు. సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే టెక్నాలజీ రంగాల్లో కూడా ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారు.