చైనీస్ జ్యోతిష్యం: ఈ 3 రాశుల వారు పుట్టుకతోనే మహా మేధావులు! మీ పుట్టిన తేదీ ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి

సాధారణంగా మనకు మేషం, వృషభం వంటి రాశిఫలాలు ఉన్నట్టే.. చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో జంతువుల ఆధారంగా రాశులను లెక్కిస్తారు. కొన్ని ప్రత్యేక సంవత్సరాల్లో పుట్టిన వారు అసాధారణమైన మేధస్సు, పదునైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో టాప్ 3లో ఉన్న రాశుల వివరాలు మీకోసం.

Published on: May 9, 2026, 14:01:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనకి ఎలా అయితే రాశి ఫలాలు ఉంటాయో, చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో జంతువులు ఉంటాయి. ప్రాచీన గ్రంథాలు, చైనీస్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అసాధారణమైన మేధస్సుతో ప్రత్యేకంగా నిలిచే రాశుల గురించి ఈరోజు చూద్దాం. వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

చైనీస్ జ్యోతిష్యం: ఈ 3 రాశుల వారు పుట్టుకతోనే మహా మేధావులు! మీ పుట్టిన తేదీ ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి (pinterest)
చైనీస్ జ్యోతిష్యం: ఈ 3 రాశుల వారు పుట్టుకతోనే మహా మేధావులు! మీ పుట్టిన తేదీ ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి (pinterest)

ఈ జంతువులకు సంబంధించిన వారు పదునైన బుద్ధి, చురుకైన ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. అంతేకాదు, వినూత్నమైన ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. మరి వారు ఎవరు? ఎవరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి? పుట్టుకతోనే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉన్నవారు ఎవరు? అనే దాని గురించి ఇప్పుడే చూసేద్దాం.

ఈ చైనీస్ రాశులకు చాణక్యుడిని మించిన తెలివితేటలు

1.ఎలుక

పుట్టిన సంవత్సరాలు: 1924, 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020.

ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఎలుకకు చెందినవారు. ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. పదునైన జ్ఞాపకశక్తి వీరికి ఉంటుంది. వీరు తెలివితేటలతో ప్రత్యేకంగా నిలుస్తారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం, పరిస్థితులను వీరు సులభంగా అర్థం చేసుకోగలరు.

క్లిష్టమైన పరిస్థితులను కూడా జాగ్రత్తగా పరిష్కరిస్తారు. తక్కువ శ్రమతో అవకాశాలను విజయాలుగా మార్చుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది. ఎలుక నీటి తత్వానికి చెందిన రాశి కనుక, మానసిక చురుకుదనం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం, విద్య వంటి రంగాల్లో మంచి నాయకులుగా ఎదుగుతారు.

2.డ్రాగన్

పుట్టిన సంవత్సరాలు: 1928, 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012, 2024.

ఈ సంవత్సరాల్లో పుట్టినట్లయితే వారి రాశి డ్రాగన్ అవుతుంది. మీరు కూడా ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు దూరదృష్టి కలిగిన వారు. వీరి దృష్టి ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక లక్ష్యాలపైనే ఉంటుంది. అంతేకాదు, ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

తెలివితేటలు, అద్భుతమైన జ్ఞాపకశక్తి వీరిలో ఉంటుంది. సహజ తత్వవేత్తలు, మార్గదర్శకులు కూడా. గొప్ప ఆలోచనలను సృష్టిస్తారు. వాటిని శక్తివంతంగా అమలు చేసే సామర్థ్యం వీరిలో ఉంటుంది. అగ్ని, భూమి తత్వాల కలయిక వీరిలో ఉండడంతో ఇతరులను కూడా ప్రేరేపించగలరు.

3.కోతి

పుట్టిన సంవత్సరాలు: 1932, 1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016, 2028.

ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు కోతికి చెందినవారు. ఈ రాశి వారు సరదా స్వభావంతో పాటు లోతైన తెలివితేటలతో ఉంటారు. హాస్యాన్ని, మేధస్సును బ్యాలెన్స్ చేస్తారు. కొత్త విషయాలను కూడా ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు వేగంగా నేర్చుకోగలరు.

ఏ నైపుణ్యానికైనా సరే త్వరగా అలవాటు పడిపోతారు. సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే టెక్నాలజీ రంగాల్లో కూడా ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More