...
...
Next Story

ఒకే నెలలో రెండు గ్రహణాలు.. తేదీ, సమయం, భారతదేశంపై వాటి ప్రభావం గురించి తెలుసుకోండి!

ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు జ్యోతిష్య నిపుణులు కూడా గ్రహణాలను అత్యంత కీలకమైన సంఘటనలుగా పరిగణిస్తారు. 2026 సంవత్సరంలో రాబోయే రెండో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడతాయి? అవి భారతదేశంలో కనిపిస్తాయా? సూతక కాలం వర్తిస్తుందా? వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Apr 10, 2026 05:30 PM IST
Advertisement

2026లో చివరి ఆరు నెలల్లో ఏర్పడే గ్రహణాలు: గ్రహణాలు అనేవి కేవలం ఆకాశంలో జరిగే మార్పులు అనుకుంటే పొరపాటే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇవి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. అలాగే శక్తి స్థాయిలను కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. గ్రహణ నీడలు భూమిపై పడితే ఈ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతాయి. ఒక గ్రహణం నిర్దిష్ట ప్రాంతంలో కనబడినప్పుడు, దాని ప్రభావం సూతక కాలం వర్తిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

2026లో చివరి ఆరు నెలల్లో ఏర్పడే గ్రహణాలు

2026లో వచ్చే రెండవ సూర్యగ్రహణం:

2026లో చివరి ఆరు నెలల్లో ఏర్పడే గ్రహణాలు
2026లో చివరి ఆరు నెలల్లో ఏర్పడే గ్రహణాలు

ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించబోతోంది. ఇక ఈ గ్రహణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కాలవ్యవధి:

గ్రహణ సమయం ఆగస్టు 12 రాత్రి 9:04కి ఈ సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆగస్టు 13 తెల్లవారుజామున 4:25 గంటలకు ముగుస్తుంది.

భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనపడుతుందా?

సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదు. కాబట్టి సూతక కాలం వర్తించదు. నిత్య పూజలు, శుభకార్యాలు, ఆలయ సందర్శన వంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోవచ్చు.

ఎక్కడ ఇది కనపడుతుంది?

ఇది ఆర్కిటిక్, గ్రీన్‌ల్యాండ్, ఐస్లాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర స్పెయిన్ ప్రాంతాల్లో కనబడుతుంది. ఫ్రాన్స్, యూకే, ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా ఈ సూర్య గ్రహణం కనపడుతుంది.

2026 రెండవ చంద్రగ్రహణం:

ఇది కూడా ఆగస్టులోనే సంభవించనుంది. ఆగస్టు 28న ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

2026 రెండవ చంద్ర గ్రహణం సమయం:

ఇది ఆగస్టు 28 ఉదయం సమయంలో ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం లాగే చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనపడదు. కాబట్టి సూతక కాలం పరిగణించబడదు.

ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనపడుతుంది?

భారతదేశంలో కనపడకపోయినా, గ్రహణ సమయంలో గ్రహాల గమనం మారడం వలన రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. గ్రహణ సమయంలో ధ్యానం చేయడం, జపాలు చేయడం వంటివి ప్రతికూల శక్తిని తగ్గిస్తాయి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe