Solar Eclipse: ఈరోజే 2026లో వచ్చే తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులకు ఊహించని లాభాలు, వారికి మాత్రం సమస్యలు!
ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏ రోజు అనగా, ఫిబ్రవరి 17 మంగళవారం నాడు ఏర్పడనుంది. ఈరోజు అమావాస్య కూడా ఉంది. అయితే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు. కానీ ప్రపంచవ్యాప్తంగా సూర్య గ్రహణ ప్రభావం ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏ రోజు అనగా, ఫిబ్రవరి 17 మంగళవారం నాడు ఏర్పడనుంది. ఈరోజు అమావాస్య కూడా ఉంది. అయితే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు.

కానీ ప్రపంచవ్యాప్తంగా సూర్య గ్రహణ ప్రభావం ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది. మరి సూర్యగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను తీసుకురాబోతోంది? ఏ రాశుల వారు సమస్యలను ఎదుర్కోబోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజే 2026లో వచ్చే తొలి సూర్యగ్రహణం.. కొన్ని రాశుల వారికి లాభాలు, మరి కొన్ని రాశుల వారికి సమస్యలు
మేషరాశి:
మేష రాశి వారికి సూర్యగ్రహణం వలన కొన్ని లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు కెరీర్‌లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ఆనందంగా ఉంటారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా సమస్యలు తొలగిపోతాయి. కానీ పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఈ సమయంలో సరైనది కాదు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటట్టు చూసుకోండి.
మిధున రాశి:
మిధున రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వలన ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు గురించి కొత్త ప్లాన్లు వేసుకుంటే మంచిది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు సూర్యగ్రహణం సమయంలో శుభవార్తలను వింటారు. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పని ప్రదేశంలో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.
సింహ రాశి:
సింహ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహణం కారణంగా ఈ రాశి వారికి పని ప్రదేశంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అనవసరంగా అందరిని గుడ్డిగా నమ్మకండి.
కన్యా రాశి:
కన్యా రాశి వారు పాత ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పురోగతిని చూస్తారు.
తులా రాశి:
తులా రాశి వారికి సూర్య గ్రహణం కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు కూడా సూర్యగ్రహణం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. పాత గొడవలు తగ్గుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు సూర్యగ్రహణం కారణంగా భారీగా లాభాలను పొందుతారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా కలిసి వస్తుంది. పని ప్రదేశంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
మకర రాశి:
మకర రాశి వారికి పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. సీనియర్ల సపోర్ట్ కూడా ఉంటుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి సమస్యలను తీసుకు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


