...
...
Next Story

Solar Eclipse 2026: సూర్య గ్రహణం వేళ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పఠించాల్సిన సూర్య మంత్రాలు!

సూర్య గ్రహణం సమయంలో కొన్ని మంత్రాలను పఠిస్తే సూర్య గ్రహాన్ని బలపరచొచ్చు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే సమస్యలు వస్తాయి. సూర్యుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఆత్మాభిమానం, చురుకుదనం పొందవచ్చు. అలాగే జాతకంలో సూర్యుడి స్థానం బాగుంటే చక్కని సంపాదన ఉంటుంది.

Published on: Feb 17, 2026, 13:30:49 IST
Advertisement

ఈరోజు 2026లో వచ్చిన మొదటి సూర్యగ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణం సమయంలో కొన్ని మంత్రాలను పఠిస్తే సూర్య గ్రహాన్ని బలపరచొచ్చు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే సమస్యలు వస్తాయి. సూర్యుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఆత్మాభిమానం, చురుకుదనం పొందవచ్చు. అలాగే జాతకంలో సూర్యుడి స్థానం బాగుంటే చక్కని సంపాదన ఉంటుంది.

సూర్య గ్రహణం వేళ ఈ మంత్రాలను పఠిస్తే జాతకంలో సూర్యుడి స్థానాన్ని బలపరచవచ్చు

Solar Eclipse 2026: సూర్య గ్రహణం వేళ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (pinterest)
Solar Eclipse 2026: సూర్య గ్రహణం వేళ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (pinterest)

సూర్య గాయత్రీ మంత్రం: ఓం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్

ఈ మంత్రాన్ని పఠించడం వలన బాగా కలిసి వస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ సమయంలో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విజ్ఞానాన్ని పొందవచ్చు. కనీసం 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించడం మంచిది.

సూర్య బీజ మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః

ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ఏర్పడుతుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.

ఓం సూర్యాయ నమః

ఈ మంత్రం జపిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో సూర్యుడి స్థానాన్ని బలపరచొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.

ఆదిత్యాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్

ఈ మంత్రాన్ని చదవడం వలన ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ఏర్పడుతుంది. అలాగే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో సూర్య స్థానం బలపడుతుంది. సమస్యలను తొలగించొచ్చు.

సూర్యగ్రహణ వేళ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఈరోజు సూర్య గ్రహణం వున్నా భారతదేశంలో కనిపించదు. కనుక సూతక కాలం కూడా వర్తించదు. కానీ చాలా మంది గర్భిణీలు ఈరోజు జాగ్రత్తగా ఉంటారు. కొన్ని తప్పులు చేయకుండా చూసుకుంటారు.
  • గర్భిణీలు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
  • గ్రహణ సమయంలో వంట చేయడం, భోజనం చేయడం వంటివి చేయకూడదు. అవసరమైతే పండ్లు, పానీయాలు తీసుకోవచ్చు.
  • గ్రహణ సమయంలో నిద్రపోవడం మంచిది కాదు. అలాగే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
  • గ్రహణ సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులను ముట్టుకోకుండా ఉండడం మంచిది. కత్తి, కత్తెర వంటివి ముట్టుకోకండి.
  • గ్రహణ సమయంలో గర్భిణీలు ప్రశాంతకరమైన మంత్రాలను జపిస్తూ ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సానుకూల ఆలోచనలు కూడా కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe